Saudi Arabia: సౌదీ అరేబియాలో ఈజిప్టు పిరమిడ్ల కంటె పురాతనమైన కట్టడాలు..ఇవి ఏడువేల సంవత్సరాల కంటె ముందు నిర్మించినవట!

సౌదీ అరేబియా పురావస్తుశాఖ ఈజిప్టులోని పిరమిడ్స్ కంటే చాలా పురాతనమైన కట్టడాలను కనుగొన్నారు. నియోలితిక్‌(నవీన శిలా యుగము) క్రీ.పూ.10000-5000) కాలానికి సంబంధించిన కట్టడాలుగా వీటిని భావిస్తున్నారు.

Saudi Arabia: సౌదీ అరేబియాలో ఈజిప్టు పిరమిడ్ల కంటె పురాతనమైన కట్టడాలు..ఇవి ఏడువేల సంవత్సరాల కంటె ముందు నిర్మించినవట!
Saudi Arabia Mustatils
Follow us
KVD Varma

|

Updated on: May 01, 2021 | 10:15 PM

Saudi Arabia: సౌదీ అరేబియా పురావస్తుశాఖ ఈజిప్టులోని పిరమిడ్స్ కంటే చాలా పురాతనమైన కట్టడాలను కనుగొన్నారు. నియోలితిక్‌(నవీన శిలా యుగము) క్రీ.పూ.10000-5000) కాలానికి సంబంధించిన కట్టడాలుగా వీటిని భావిస్తున్నారు. వాయువ్య అరేబియాలో 7,000 సంవత్సరాల పురాతన దీర్ఘచతురస్రాకార రాతి నిర్మాణాలపై పురావస్తు శాఖ చేస్తున్న సర్వేలో ఈ కట్టడాలు కనుగొన్నారు. నిజానికి ఈ కట్టడాలు 1970లోనే వెలుగులోకి వచ్చాయి. కానీ, అప్పటినుంచీ వీటి గురించిన సమాచారం అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది.

ఈ కట్టడాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండడంతో వీటికి ముస్టాటిల్స్ అని పేరుపెట్టారు. దానికి అరబిక్ లో అర్ధం దీర్ఘ చతురస్రం అని.. ఇవి 20 నుంచి 620 మీటర్ల వరకూ భారీ రాతి నిర్మాణాలతో ఉన్నాయి. ఈ భారీ రాతి కట్టడాలు సౌదీ అరేబియాలోని అలులా , ఖైబర్ కౌంటీ ప్రాంతాలలో అధిక భాగం ఉన్నాయి. ఈ ప్రాంతంపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్దదైన పురావస్తు అధ్యయనం అయిన దీనిని వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించింది.

సుమారు 350 వైమానిక సర్వేలతొ ఈ పరిశోధనలు నిర్వహించారు. క్రమబద్ధమైన రిమోట్ సెన్సింగ్ ద్వారా 641 ముస్టాటిల్స్ ను కనుగొన్నారు. గతంలో ఉనికిలోకి వచ్చిన వాటికంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.ఈ కట్టడాల్లో ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు, వ్యవస్థీకృత గదులు, పొడవాటి ప్రాంగణ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్మారక కట్టడాలను నిర్మించడానికి ఈ ప్రాంతంలో నివసించిన పూర్వ సమాజాల భాగస్వామ్య నమ్మకాలు వీటిని నిర్మించిడానికి దోహదంపడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఈ కట్టడాలపై రేడియోకార్బన్ పరీక్షలు నిర్వహించిన తరువాత , అవి నియోలిథిక్ కాలంకు చెందినవని కనుగొన్నారు. ఇక్కడ భారీ ఎత్తున దొరికిన పశువుల ఎముకల ఆధారంగా ఈ ప్రాంతంలో గుర్తు తెలియని దేవుళ్ళకు పశుబలులు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

నార్త్-వెస్ట్ అరేబియాకు చెందిన ఈ ముస్టాటిల్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద స్మారక కట్టడాలుగా నిలుస్తాయని ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మెలిస్సా కెన్నెడీ తెలిపారు. ముస్టాటిల్స్ నియోలిథిక్‌ కాలానికి చెందిన వారి పూర్వీకుల గురించి తెలియజేయడానికి ప్రాదేశిక గుర్తులుగా కూడా పనిచేసి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

Also Read: Adar Poonawalla: కోవిడ్ టీకాల కోసం పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనవల్లా

Sumo Wrestling: ప్రత్యర్ధి చేతిలో దెబ్బతిన్న సుమో రెజ్లర్..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు..