Sumo Wrestling: ప్రత్యర్ధి చేతిలో దెబ్బతిన్న సుమో రెజ్లర్..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు..

సుమో రెజ్లింగ్ పురాతన క్రీడ. భారీకాయంతో ఉండే క్రీడాకారులు పాల్గొనే ఈ క్రీడ పట్ల చాలా మంది మక్కువ చూపుతారు. ఎక్కువ జపాన్ లో ఈ ఆటకు ప్రాచుర్యం ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు అభిమానులు ఉన్నారు.

Sumo Wrestling: ప్రత్యర్ధి చేతిలో దెబ్బతిన్న సుమో రెజ్లర్..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు..
Sumo Wrestlimg
Follow us
KVD Varma

|

Updated on: May 01, 2021 | 8:48 PM

Sumo Wrestling: సుమో రెజ్లింగ్ పురాతన క్రీడ. భారీకాయంతో ఉండే క్రీడాకారులు పాల్గొనే ఈ క్రీడ పట్ల చాలా మంది మక్కువ చూపుతారు. ఎక్కువ జపాన్ లో ఈ ఆటకు ప్రాచుర్యం ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు అభిమానులు ఉన్నారు. ఈ ఆటలో పాల్గొనే ఆటగాళ్లకు ఆదరణా ఉంది. ఇటీవల జపాన్ కు చెందిన హిబికిర్యూ(26) ఒక పోటీలో పాల్గొన్నాడు. అందులో ప్రత్యర్ధి చేతిలో దెబ్బ తిన్నాడు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన హిబికిర్యూ శుక్రవారం మరణించాడు.

సుమో రెజ్లింగ్ లో ఇప్పుడిప్పుడే హిబికిర్యూ రాణిస్తున్నాడు. మార్చి 26వ తేదీన చివరిసారిగా ఓ టోర్నమెంట్ లో తలపడ్డాడు. ఆ సమయంలో ప్రత్యర్ధి హిబికిర్యూను బౌట్ లో మట్టి కరిపించే ప్రయత్నంలో గట్టిగా కిందపడేశాడు. దీంతో హిబూ కు తల నెలకు బలంగా తాకింది. అక్కడికక్కడే హిబూకిర్యూ కుప్పకూలిపోయాడు. సాదారణంగా కింద పడిన రెజ్లర్ లు తిరిగి వాళ్ళంత వాళ్ళే పైకి లేస్తారు. అలాగే హిబూకిర్యూ కూడా లేస్తాడని అందరూ భావించారు. కానీ, అతను పైకి లేవకపోవడంతో అనుమానం వచ్చిన మ్యాచ్ ప్రతినిధులు అతనిని పరిశీలించి గాయపడినట్టుగా నిర్ధారించి ఆసుపత్రికి పంపించారు. సుమారు నెలరోజులకు పైగా ఆసుపత్రిలో వైద్య సహాయం పొందుతున్న హిబూకిర్యూ చివరికి మరణించాడు. ఈ విషయాన్ని జపాన్‌ సుమో అసోసియేషన్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆటను శ్వాసకోశ సంబంధ సమస్యలతో మరణించినట్టు చెప్పింది.

Also Read: నీలా డబ్బుకోసం తలపాగా ధరించను..! అక్షయ్ కుమార్‌పై హాట్ కామెంట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్..?

కరోనా: సన్‌రైజర్స్‌ క్రికెటర్‌ పెద్ద మనసు.. ‘శభాష్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.!