నేనున్నానని మీకేం కాదని… కరోనా బాధితులకు అండగా నిలిచిన మనసున్న మారాజు.. టీమిండియా ఆటగాడు..

Ajinkya Rahane: కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. కోవిడ్‌పై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌(IPL) ఆటగాళ్లు తమవంతు..

నేనున్నానని మీకేం కాదని... కరోనా బాధితులకు అండగా నిలిచిన మనసున్న మారాజు.. టీమిండియా ఆటగాడు..
Follow us

|

Updated on: May 01, 2021 | 10:11 PM

దేశం సమస్యల్లో ఉంటే తాము ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటామని మరోసారి నిరూపించుకుంటున్నారు క్రికెటర్లు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. కోవిడ్‌పై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌(IPL) ఆటగాళ్లు తమవంతు సాయాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే..  బ్రెట్‌ లీ, పాట్‌ కమిన్స్‌, సచిన్‌, శిఖర్‌ ధావన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్ రాయల్స్‌ జట్లు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో మరో ఆటగాడు కూడా బాధితుల పాలిట దేవుడిగా మారాడు. టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌, ఐపీఎల్‌(IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రహానె… 30 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ను మిషన్‌ వాయు అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించాడు.

రహానె చేసిన సహాయానికి  మహారత్తా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ను మహారాష్ట్రలోని అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతాలకు వీటిని పంపుతామని వెల్లడించింది. “మిషన్‌ వాయు అనే ఎన్జీవోకు 30 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ అందించిన రహానెకు ధన్యవాదాలు. మహారాష్ట్రలో కోవిడ్ వ్యాప్తి  అధికంగా ఉన్న జిల్లాలకు వీటిని అందజేస్తామని’ MCCIA తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశంలో ప్రతిరోజూ 4లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది.