కోహ్లీ ఓపెనర్‌గా పనికిరాడు..! ఆ బ్యాట్స్‌మెన్‌ను ఓపెనర్ చేయండి.. ఆర్‌సీబీకి సలహా ఇచ్చిన టీం ఇండియా మాజీ ప్లేయర్..
Sehwag Coments : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఐపిఎల్ 2021 తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Sehwag Coments : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఐపిఎల్ 2021 తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్‌లో జట్టు చాలా బలంగా ఉంది. అయితే గత 3 మ్యాచ్‌ల్లో 2 సార్లు ఓడిపోయింది. దీంతో క్రికెట్ విమర్శకులు మరోసారి జట్టు వ్యూహాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ జట్టు పంజాబ్ కింగ్స్ పై 34 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ సీజన్‌లో రెండోసారి విరాట్ కోహ్లీ జట్టు బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. మొత్తం టాప్, మిడిల్ ఆర్డర్ విఫలమైంది. అందుకే బ్యాటింగ్ క్రమంలో మార్పు చేయాలని వీరేందర్ సెహ్వాగ్ సూచించగా ఓపెనింగ్ నుంచి వైదొలగాలని విరాట్ కోహ్లీకి సూచించాడు.
మొదట చెన్నై సూపర్ కింగ్స్, తరువాత పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్లపై పెద్ద ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. రెండు సార్లు జట్టు లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించింది కానీ రెండు మ్యాచ్‌ల్లోనూ 100 పరుగుల లోపే సగానికి పైగా అవుటై ఓటమిని నిర్ణయించారు. చివరి బ్యాట్స్ మెన్ కొన్ని ముఖ్యమైన పరుగులు జోడించి జట్టు గౌరవాన్ని కాపాడారు. ఈ ఓటమి తరువాత జట్టు బ్యాటింగ్ క్రమంపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా మూడో స్థానంలో ఉన్న రజత్ పాటిదార్‌ను తొలగించడాన్ని అందరూ విమర్శిస్తున్నారు.
ఇప్పుడు మాజీ వెటరన్ భారత బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్ ఓపెనింగ్ జతను మార్చమని జట్టుకు సూచించాడు. క్రిక్ బజ్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ తన 3 వ స్థానానికి తిరిగి రావాలని మొహమ్మద్ అజారుద్దీన్‌ను ఓపెనింగ్‌కు తీసుకురావడం గురించి ఆలోచించాలని చెప్పాడు. ప్రస్తుతం అతను పాటిదార్ కంటే మంచి ఎంపికగా ఉన్నాడు. కోహ్లీ మూడో స్థానంలో ఉండాలి అతని తరువాత మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ ఉంటే మంచిదన్నాడు” ఓపెనర్లు దేవదత్ పాడికల్, అజారుద్దీన్ బాగా ప్రారంభించలేకపోతే వారికి వరుసగా 3 ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్లు ఉంటారు ఇది ఆర్సీబీకి ప్రయోజనం చేకూరుస్తుందని సెహ్వాగ్ అన్నారు.
విరాట్ కోహ్లీ ఈ సీజన్ ప్రారంభానికి ముందే తాను ఆర్‌సిబికి ఓపెనింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే కోహ్లీకి సమయం బాగాలేదు. రాజస్థాన్ రాయల్స్పై అర్ధ సెంచరీ కాకుండా ఒక్క సమర్థవంతమైన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అదేవిధంగా మూడో స్థానంలో జట్టు వేర్వేరు ఆటగాళ్లను ప్రయత్నించింది అయితే ఎవ్వరూ పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయారు.