20 ఏళ్లకే కెప్టెన్..? సచిన్‌ను మించిన మొనగాడు..! పదకొండు మంది సంతానంలో ఒకడు.. మామూలోడు కాదు ఈ ఆటగాడు..
Brian Lara Birthday Special : ఎటువంటి చర్చ లేకుండా ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్లలో బ్రియాన్ లారా ఒకరు. 90 వ దశకంలో ప్రపంచంలోని అత్యంత
Brian Lara Birthday Special : ఎటువంటి చర్చ లేకుండా ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్లలో బ్రియాన్ లారా ఒకరు. 90 వ దశకంలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లలో అతను కూడా పేరు పొందాడు. చాలా మంది బౌలర్లు, నిపుణులు బ్రియాన్ లారా ఆట సచిన్ టెండూల్కర్ కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంటుందని చెప్పారు. అతను టెస్ట్ క్రికెట్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 375, 400 నాట్ అవుట్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ 501 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ కూడా అతని పేరున ఉంది. ఈ రోజు బ్రియాన్ లారా పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని గురించి తెలియని కొన్ని విషయాలు మీ కోసం.
బ్రియాన్ లారా 2 మే 1969 న ట్రినిడాడ్‌లోని శాంటా క్రజ్‌లో జన్మించారు. అతను 11 తోబుట్టువులలో 10 మెంబర్. అతను మొదట్లో ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ ఆడాడు కానీ క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. అతను 14 సంవత్సరాల వయస్సులో ట్రినిడాడ్ అండర్ -19 జట్టులో, 20 సంవత్సరాల వయస్సులో జట్టు కెప్టెన్ అయ్యాడు. అతను ఈ జట్టుకు అతి పిన్న వయస్కుడు. అతను 20 సంవత్సరాల వయస్సులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. సర్ డాన్ బ్రాడ్మాన్ తరువాత ఎవరైనా బ్యాట్స్ మాన్ టెస్ట్ క్రికెట్లో పెద్ద స్కోర్ సాధించాడంటే అతడు బ్రియాన్ లారా.
375 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. అనంతరం రెండు నెలల వ్యవధిలో అజేయంగా 501 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత టెస్ట్ స్కోరు 375 పరుగులు. తరువాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతిపెద్ద ఇన్నింగ్స్ 501 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫస్ట్ క్లాస్లో ఈ ఇన్నింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. 375 పరుగులు చేసిన 10 సంవత్సరాల తరువాత 1994 లో బ్రియాన్ లారా మళ్లీ చరిష్మా చేశాడు. ఇంగ్లండ్‌పై అజేయంగా 400 పరుగులు చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో 400 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఈ రోజు కూడా టెస్ట్ క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్.
2006 లో అతను టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తరువాత సచిన్ టెండూల్కర్ తన పేరు మీద ఈ రికార్డ్ చేశాడు. 131 టెస్టుల్లో 52.88 సగటుతో 11953 పరుగులు చేశాడు. అతని పేరుపై 34 సెంచరీలున్నాయి. అదే సమయంలో 299 వన్డేలలో అతను 19 సెంచరీలు, 40.48 సగటుతో 10405 పరుగులు చేశాడు. బ్రియాన్ లారా మూడుసార్లు వెస్టిండీస్ కెప్టెన్ అయ్యాడు. కానీ మిగతా ఆటగాళ్ల పేలవమైన ఆటతీరు కారణంగా వెస్టిండీస్ ఆట స్వల్పంగా ఉండేది. అతని కెప్టెన్సీలో వెస్టిండీస్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2007 ప్రపంచ కప్ తరువాత లారా కెప్టెన్సీ నుంచి నిష్క్రమించాడు. తరువాత పదవీ విరమణ చేశాడు.