AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బిడ్డ ఆకలి తీర్చేందుకు తల్లి పడిన తపన.. రైలు దిగిన అమ్మ.. కదిలిన ట్రైన్.. వీడియో వైరల్

అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సృష్టిలో అపురుపమైంది అమ్మ ప్రేమ. తన జీవితం తన కోసం కాదు తన పిల్లల కోసం అనుకునే త్యాగమూర్తి అమ్మ. అటువంటి అమ్మ ప్రేమకి మచ్చే తెచ్చే మాతృ మూర్తుల గురించి తరచుగా అనేక కథలు వింటూనే ఉన్నాం.. అదే సమయంలో అమ్మ ప్రేమ అంటే ఇదే అంటూ తెలియజేస్తూ అనేక సంఘటలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి నెటిజన్లను ఆకర్షించింది. ఆకలి అని ఏడుస్తున్న బిడ్డ ఆకలి తీర్చేందుకు తల్లి పడిన తపనను తెలియజేస్తుంది ఈ వీడియో.

Viral Video: బిడ్డ ఆకలి తీర్చేందుకు తల్లి పడిన తపన.. రైలు దిగిన అమ్మ.. కదిలిన ట్రైన్.. వీడియో వైరల్
Viral VideoImage Credit source: X/@Gulzar_sahab
Surya Kala
|

Updated on: Jan 08, 2025 | 8:29 PM

Share

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకలితో ఏడుస్తున్న కొడుకు కోసం పాలు కొనేందుకు స్టేషన్‌లో దిగింది. అయితే అప్పుడు రైలు స్టార్ట్ అయింది. మహిళ ప్లాట్‌ఫారమ్‌పైకి పరిగెత్తింది. అయితే అప్పటికే రైలు వేగం పుంజుకుంది. కదులుతున్న రైలు.. తన పిల్లాడిని తలచుకుని నిసహాయ స్థితిలో ఆ తల్లి బోరున ఏడ్చింది. హృదయాన్ని కదిలించేలా ఆ మహిళ బోరున విలపించింది. ఇది చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ ట్రాక్ పక్కన నిలబడి బోరున విలపిస్తోంది. పాలు కొనుక్కుని తర్వాత స్టేషన్‌ నుంచి రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ మహిళకు రైల్వే గార్డు దేవదూతలా మారి సాయం చేశాడు. మహిళ గార్డుకు తన పరిస్థితి గురించి చెప్పడంతో అతను రైలును ఆపాడు. రైలు ఆగిన వెంటనే ఆ మహిళ రైలు ఎక్కేందుకు పరిగెత్తడం వీడియోలో కనిపిస్తుంది. అయితే అసలు మ్యాటర్ ఏంటనే విషయం టీవీ9 ధృవీకరించడం లేదు.

ఇవి కూడా చదవండి

@Gulzar_sahab హ్యాండిల్లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ భారీ సంఖ్యలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా వీక్షించారు. ఒక తల్లి పాలు పట్టేందుకు వెళ్లిందని.. రైలు స్టార్ట్ అయ్యిందని వినియోగదారు పేర్కొన్నారు. గార్డు చూసి రైలు ఆపాడు.

ఒకరు ఈ వీడియో పై స్పందిస్తూ భారతదేశం అనేది నిబంధనలపై భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయించే దేశం అని చెప్పారు. రైలును ఆపిన గార్డు గౌరవానికి అర్హుడని మరోకరు చెప్పారు. ఇది చూసిన తర్వాత మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తోందని ఒకరు.. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని రకరకాలుగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..