ఏడాది పాటు ఎదురుచూసే పండగ సంక్రాంతి పండగ అంటే ఇంటి ముంగిట ముగ్గులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, కొత్త అల్లుడు, కోడి పందాలు మాత్రమే కాదు నువ్వుల నూనేతో చేసే స్నానం, నువ్వులతో చేసే పిండి వంటలు కూడా..సంక్రాంతి రోజున చేసే పిండి వంటల్లో నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు అభ్యంగ స్నానం చేసే సమయంలో నువ్వుల నూనె ను ముందుగా శరీరానికి రాసి నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తారు. అయితే మకర సంక్రాంతికి నువ్వులకు మధ్య పురాణాల ప్రకారం ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.