Chanakya Niti: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే.. చాణక్య చెప్పిన ఈ విషయాలు పాటించి చూడండి..
ఆచార్య చాణుక్యుడు అధ్యాపకుడు.. రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు.. మంచి సామజిక వేత్త కూడా. మానవ జీవితం సుఖ సంతోషాలతో సాగాలంటే ఎలా ఉండాలి.. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలని అనే విషయాలను కూడా ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో చెప్పారు. వీటిని పాటించడం వలన వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఆనందంతో నిండి పోతుంది. అంతే కాదు వైవాహిక జీవితంలోని సమస్యలన్ని కూడా ముగిసిపోతాయి.
మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడైన ఆచార్య చాణక్యుడి ఆలోచనలు .. మనవ జీవన విధానం గురించి ఆయన అప్పుడు చెప్పిన విషయాలు నేటికీ అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. చాణక్య నీతిని అనుసరించేవారి పాదాలను విజయం ఖచ్చితంగా ముద్దాడుతుందని అంటారు. చాణక్య విధానాన్ని అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు. చాణక్యుడి విధానాలే సామాన్యుడైన చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్ఞినేత స్థాయికి తీసుకెళ్లాయి.
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆలోచనాపరుడు
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆలోచనాపరుడు. అంతే కాదు చాణుక్యుడు నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు కూడా. జీవితానికి, రాజ్యపాలనకు సంబంధించిన అనేక విషయాలు చెప్పాడు. ముందుకు వెళ్లేందుకు మాత్రమే కాదు ఆచార్య చాణక్యుడు వివాహ సంబంధాల గురించి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవిత భాగస్వామితో మన సంబంధాన్ని మరింత బలోపేతం చేసే కొన్ని విషయాలను గురించి కూడా చెప్పాడు. వివాహ సంబంధాలను బలోపేతం చేసే చాణక్యుడి చెప్పిన విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
నిజాయితీ, నిజమైన ప్రేమ
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఏ సంబంధంలోనైనా నిజాయితీ, నిజమైన ప్రేమ ఉండాలి. ఈ రెండు విషయాలు బలమైన బంధానికి ఆధారం. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ, నిజాయితీ లోపిస్తే అప్పుడు ఆ సంబంధంలో చీలిక ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో నిజాయితీ, నిజమైన ప్రేమ ఈ రెండింటి మధ్య సమతుల్యతను సృష్టించాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఆనందం, శాంతి కోసం ప్రేమ.. నిజాయితీ అవసరమని ఆచార్య చాణక్యుడు వివరించాడు.
అహం అతిపెద్ద శత్రువు
అహం మనిషి అతిపెద్ద శత్రువు. ఇది మంచి సంబంధాలను పాడు చేస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. భార్యాభర్తల మధ్య అహంభావం పెరిగితే ఆ బంధం తెగిపోవచ్చు. అహం కారం ఉన్న సంబంధాలలో ప్రేమ ఉండదు. కనుక భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ పరస్పరం మర్యాదపూర్వకంగా ఉండాలి. అహాన్ని భార్యాభర్తలు ఇద్దరూ తమ బంధానికి దూరంగా ఉంచాలి.
నిజం, పారదర్శకత
భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరికొకరు అబద్ధాలు చెప్పకూడదు. భార్యాభర్తల మధ్య సంబంధంలో నిజం, పారదర్శకత ఉండాలని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం వలన సంబంధంలో అపార్థాలు ఏర్పడతాయి. నిజం, పారదర్శకత లోపిస్తే భార్యాభర్తల సంబంధం చెడిపోతుంది. నిజం, సత్యం, పారదర్శకత భార్యాభర్తల మధ్య సంబంధాలపై నమ్మకాన్ని పెంచడమే కాదు.. ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు అండగా నిలుస్తారు.
మూడో వ్యక్తి మాటలకు చోటు ఇవ్వొద్దు
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యాభర్తలు తమకు సంబంధించిన విషయాలలో మూడవ వ్యక్తికి జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వవద్దు. భార్యాభర్తలు మధ్య ఏ విషయంలోనైనా మూడవ పక్షం జోక్యం చేసుకుంటే.. భార్యభర్తల మధ్య సంతోషం లోపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.