Viral Video: ఒకే వేదికపై ఒకేసారి ఆరుగురు అన్నదమ్ములు ఆరుగురు అక్కాచెల్లెళ్ల పెళ్లి.. వరుల అంతరంగం తెలిస్తే శభాష్ అంటారు..
ప్రస్తుతం పెళ్లి అంటే అత్యంత ఆడంబరంగా చేసుకునే ఓ వేడుకగా మారిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో తమ ఆర్ధిక శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మన పొరుగు దేశంలో జరిగిన ఓ వెళ్లి వేడుక వార్తల్లో నిలిచింది. పంజాబ్‌లో ఆరుగురు అన్నదమ్ములు ఒకే రోజు ఆరుగురు అక్కాచెల్లెళ్లను సామూహిక వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ పెళ్లి ఖర్చు తెలుసుకున్న జనం షాక్ తింటున్నారు.
దక్షిణాసియా సంస్కృతిలో వివాహాలకు ఘనంగా ఏర్పాటు చేస్తారు. భారీ సంఖ్యలో అతిథులు హాజరవుతారు. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగుతుంది. అయితే పాకిస్థాన్‌లోని ఆరుగురు సోదరులు .. ఆరుగురు సోదరీమణులను సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సామూహిక వివాహ వేడుకలో ఆరుగురు సోదరీమణులతో ఆరుగురు నిజమైన సోదరుల పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ప్రత్యేకత ఏంటంటే కట్నం తీసుకోలేదు. అనవసరంగా ఖర్చు పెట్టలేదు. అయితే ఆరుగురు అన్నదమ్ములలో చివరి వాడు.. తమ్ముడు మైనర్ కావడంతో అన్నదమ్ములంతా ఈ సామూహిక వివాహానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం తమ అన్నదమ్ములం కలిసి ఒకే రోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని పెద్ద అన్నయ్య చెప్పారు. పెళ్లిళ్లకు, భూమి తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే ఎలాంటి ఆర్థిక భారం లేకుండా తమ పెళ్లి వేడుకను గుర్తుండిపోయేలా చేయవచ్చని ప్రజలకు చూపించాలనుకున్నామని తెలిపారు.
తమ్ముడు యుక్తవయస్సు వచ్చిన తర్వాత.. సోదరులందరూ ఆరుగురు కుమార్తెలు ఉన్న కుటుంబాన్ని ఎంచుకున్నారు. వివాహ వేడుక అత్యంత సరళంగా జరిగింది. వధువు కుటుంబం నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
6 بھائیوں کی ایک ہی دن 6 بہنوں کے ساتھ شادیاں ۔ انوکھی روایت قائم کر دی#MassMarriage #IjtemaiShadi #MassWedding #Jahez #WeddingCeremony #ViralVideo #Multan pic.twitter.com/cutjkJeRDN
— UrduPoint اردوپوائنٹ (@DailyUrduPoint) December 31, 2024
@DailyUrduPoint హ్యాండిల్‌తో వీడియోను షేర్ చేస్తూ వినియోగదారు క్యాప్షన్‌లో 6 మంది సోదరులు ఒకే రోజు 6 మంది సోదరీమణులను వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం నెలకొల్పారు. అంతేకాదు వరకట్నం తీసుకోకూడదని అన్నదమ్ములంతా తీసుకున్న నిర్ణయం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. పాకిస్థానీలకు కొత్త ఆలోచనకు ప్రతీకగా భావిస్తున్నారని పేర్కొన్నాడు.
24 న్యూస్ హెచ్‌డి ఛానల్ కథనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ సామూహిక వివాహానికి కేవలం లక్ష పాకిస్తానీ రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో కేవలం 30 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..