AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: కుంభ రాశిలో రాహువు.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం విదేశీయాన యోగాలకు సంబంధించినది. రాహువు అనుకూలంగా ఉండే పక్షంలో సదరు రాశివారికి విదేశీ అవకాశాలు తప్పకుండా కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడడానికి, వీసా సమస్యలు పరిష్కారం కావడానికి, విదేశీ సొమ్ము అనుభవించడానికి రాహువే కారకుడు. అటువంటి రాహువు తనకు దాదాపు ఉచ్ఛ స్థానమైన కుంభ రాశిలో మే 18న ప్రవేశించిన దగ్గర నుంచి కొన్ని రాశులకు విదేశీ యోగం పట్టడం మొదలవుతుంది.

Astrology: కుంభ రాశిలో రాహువు.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు..
Foreign Job Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 08, 2025 | 8:43 PM

Share

రాహు గ్రహం విదేశాలకు సంబంధించినది. రాహువు అనుకూలంగా ఉండే పక్షంలో విదేశీ అవకాశాలు తప్పకుండా కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడడానికి, వీసా సమస్యలు పరిష్కారం కావడానికి, విదేశీ సొమ్ము అనుభవించడానికి రాహువే కారకుడు. అటువంటి రాహువు తనకు దాదాపు ఉచ్ఛ స్థానమైన కుంభ రాశిలో మే 18న ప్రవేశించిన దగ్గర నుంచి కొన్ని రాశులకు విదేశీ యోగం పట్టడం మొదలవుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన వీసా సమస్యలు, విదేశీ ఉద్యోగావకాశాలు చక్కబడడం మొదలవుతుంది. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశులకు తప్పకుండా విదేశీయాన అవకాశాలు లభిస్తాయి. కుంభ రాశిలో రాహువు ఏడాదిన్నర పాటు సంచారం చేస్తాడు.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల నిరుద్యోగులకు, ఉద్యో గులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి అక్కడే స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా విదేశీ పర్యటనలు చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా విదేశీ సంబంధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి త్వరలో విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల తప్పకుండా విదేశీయాన యోగం కలుగు తుంది. ఈ రాశికి చెందిన నిరుద్యోగులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఉద్యోగ ప్రయత్నాలు సాగిం చడం వల్ల ఫలితముంటుంది. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అక్కడే అన్ని విధాలా స్థిరపడడం జరుగుతుంది. ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఊహించని ఆఫర్లు అందే అవ కాశం ఉంది. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలన్నీ కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి.
  3. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు ప్రవేశం వల్ల తప్పకుండా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ రాశివారికి విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు స్వదేశీ కంపెనీల కన్నా విదేశీ కంపెనీల నుంచే ఎక్కువగా ఆఫర్లు అందడం జరుగుతుంది. విదేశాల్లో అత్యధికంగా ఆదాయం గడించే సూచనలు కూడా కని పిస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడిన కుటుంబంతోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.
  4. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల వీరికి విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఇతర దేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగంతో వీరి జీవితం ఊహించని విధంగా కొత్త మలుపు తిరుగుతుంది. కొన్ని కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి బయ టపడే అవకాశం ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనేక పర్యాయాలు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంటుంది. అనేక విధాలుగా విదేశీయానానికి అవకాశాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. విదేశాల్లోని వ్యక్తితోనే పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరత్వం పొందే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు ఉద్యోగాల కారణంగానే కాక, చదువుల నిమిత్తం కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, పరీక్షల్లో ఈ రాశివారు ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. కొద్ది ప్రయ త్నంతో వీరికి విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదే శాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. విదేశీ ఉద్యోగాలకు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.