Adar Poonawalla: కోవిడ్ టీకాల కోసం పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనవల్లా

వ్యాక్సిన్ విషయంలో తనకు వస్తున్న ఫోన్ కాల్స్ పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రపంచంలో అతి పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ సీరం సీఈవో ఆదార్ పూనవల్లా.

Adar Poonawalla: కోవిడ్ టీకాల కోసం పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనవల్లా
Adar Poonawalla
Follow us

|

Updated on: May 01, 2021 | 9:24 PM

Adar Poonawalla: వ్యాక్సిన్ విషయంలో తనకు వస్తున్న ఫోన్ కాల్స్ పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రపంచంలో అతి పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ సీరం సీఈవో ఆదార్ పూనవల్లా. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత దేశంలో కరోనా విరుచుకుపడుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దాదాపుగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 90 శాతం కోవిడ్ వ్యాక్సిన్లు సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అటువంటి కంపెనీ సీఈవోగా ఆదార్ పూనవల్లా ఫోన్ కాల్స్ ద్వారా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. తనకు వచ్చిన కాల్స్ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల నుంచి వచ్చాయని ఆయన తెలిపారు.

యూకేలో మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. “బెదిరింపులు ఒక సాధారణ విషయం. కానీ, ఇది మితిమీరింది. ప్రతి ఒక్కరూ తమకు టీకా రావాలని భావిస్తున్నారు. తమకంటె ముందు ఇంకెవరైనా ఎందుకు పొందాలో వారు అర్థం చేసుకోలేరు” అని పూనవల్లా ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

“మీరు మాకు వ్యాక్సిన్ ఇవ్వకపోతే అది మంచిది కాదని వారు చెబుతున్నారు. ఇది ఫౌల్ లాంగ్వేజ్ కాదు, అలానే మాట్లాడుతున్నారు. ఇది నేను చేయకపోతే వారు ఏమి చేయవచ్చో అనే అర్థం వచ్చేలా మాట్లాడటం. ఒకవేళ ఇది మేము పాటించకపోతే మా పని మమ్మల్ని చేసుకోనివ్వమని చెప్పే స్వరం.” అని ఆయన తెలిపారు.

పూనవల్లా ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడికి విమానాల రాకపోకలపై నిషేధం విధించకముందే ఆయన చేరుకున్నారు. ”నేను ఇక్కడ కొంత కాలం ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడప్పుడే వెనక్కి వేల్లదలుచుకోలేదు. మొత్తం నా భుజాల మీద ఒత్తిడి ఉంది. నేనొక్కడినే ఈ సమస్యను ఎదుర్కోలేను. నా పని నేను చేసుకోకుండా ఎవరెవరో కోరుతున్నట్టుగా ఉండలేను. ఇప్పుడు వ్యాక్సిన్ కోసం ఫోన్లు చేస్తున్న వారు ఏం చేస్తారనేది ఆలోచిన్చాలేను.” అంటూ ఆయన తన పరిస్థితిని వివరించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ మధ్యనే ఆయనకు వై క్యాటగిరీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో ఆయన లండన్ వెళ్ళిపోవడం..అక్కడ నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.