కరోనాపై పోరాటంలో భార‌త్‌కు అండ‌గా ఫైజ‌ర్‌ సంస్థ.. సంస్థ చరిత్రలోనే అతి పెద్ద విరాళం.!

Pfizer Company: భార‌త్‌కు అండ‌గా నిలిచింది అమెరికా ఫార్మా కంపెనీ ఫైజ‌ర్‌. సుమారు 510 కోట్లు రూపాయాల విలువైన...

కరోనాపై పోరాటంలో భార‌త్‌కు అండ‌గా ఫైజ‌ర్‌ సంస్థ.. సంస్థ చరిత్రలోనే అతి పెద్ద విరాళం.!
Pfizer
Follow us
Ravi Kiran

|

Updated on: May 03, 2021 | 9:27 PM

Pfizer Company: భార‌త్‌కు అండ‌గా నిలిచింది అమెరికా ఫార్మా కంపెనీ ఫైజ‌ర్‌. సుమారు 510 కోట్లు రూపాయాల విలువైన మందుల‌ను ఇండియాకు పంపిస్తోన్నట్లు ప్రకటించింది. ఇక ఫైజర్‌ సంస్థ చరిత్రలోనే ఇది అతి పెద్ద విరాళం కావడం విశేషం. అమెరికాతో పాటు యూర‌ప్‌, ఆసియాల‌లోని త‌మ డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్ల నుంచి ఈ మందులను ఇండియాకు పంప‌నున్న‌ట్లు ఫైజ‌ర్ చైర్మ‌న్ ఆల్బ‌ర్ట్ బౌర్లా వెల్ల‌డించారు.

ఇండియాలో క‌రోనా ప‌రిస్థితులు మ‌మ్మ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయని అన్నారు ఆల్బర్ట్‌. ఇండియాలో ప్ర‌జ‌ల కోసం మేము ప్రార్థిస్తున్నాం అని తెలిపారు. ఈ పోరాటంలో ఇండియాతో క‌లిసి సాగుతాం.. కంపెనీ చ‌రిత్ర‌లో అతిపెద్ద‌దైన సాయం చేసే దిశ‌గా చాలా వేగంగా ప‌ని చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. భార‌త ప్ర‌భుత్వం క‌రోనా చికిత్స కోసం అనుమ‌తించిన మందుల‌ను ఫైజ‌ర్ ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తోంది.

దేశంలోని ప్ర‌తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్‌కు త‌మ ఫైజ‌ర్ మందులు ఉచితంగా అందాల‌న్న ఉద్దేశంతోనే తాము ఈ ప‌ని చేస్తున్న‌ట్లు ఆల్బ‌ర్ట్ తెలిపారు. అవ‌స‌ర‌మైన వారికి ఆ మందులు అందేలా ప్ర‌భుత్వం, ఎన్జీవోల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని చెప్పారు.

Also Read: Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..