Mamata Banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి పదవికీ మమతా బెనర్జీ రాజీనామా..
CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిన
CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మమతా బెనర్జీ మూడోసారి అధికారం చేపట్టనున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఆమె కోరిక మేరకు తదనంతర కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయయని.. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ స్వయంగా ప్రకటించారు. కాగా.. మే 5న బుధవారం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మమతా ప్రమాణ స్వీకారం అనంతరం.. కొత్త క్యాబినెట్‌లోని మంత్రులు మే 6న ప్రమాణం చేయనున్నారు. ప్రోటెమ్ స్పీకర్‌గా సుబ్రతా ముఖర్జీ వ్యవహరించనున్నారు.
నిన్న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుంది. ఎన్నో అంచనాలతో ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ జనతా పార్టీ 77 స్థానాలకే పరిమితమైు్ీ. వాస్తవానికి గత అసెంబ్లీతో పోలిస్తే బీజేపీ 74 స్థానాలను అధికంగా గెలచుకుంది. ఇదిలాఉంటే.. నందిగ్రామ్‌లో మమతా బీజేపీ నేత సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు.
Also Read: