మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Next Virus Spread: కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో శాస్త్రవేత్తలు మరో సంచలన విషయాన్ని....

  • Ravi Kiran
  • Publish Date - 8:39 pm, Mon, 3 May 21
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?
Coronavirus 6

Next Virus Spread: కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో శాస్త్రవేత్తలు మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో మహమ్మారిగా ప్రబలే ఓ కొత్త రకమైన వైరస్‌ను వారు కనుగొన్నారు. అది ఎక్కడ నుంచి వ్యాపిస్తుందో.? ఏ జీవి నుంచి సంక్రమిస్తుందో.? తెలుసుకున్నారు.

బ్రెజిల్‌లోని అమెజాన్ అడవులలో ఉండే గబ్బిలాలు, కోతులు, ఎలుకల ద్వారా మహామ్మరిగా ప్రబలే ఓ కొత్త రకం వైరస్ చెందుతుందని.. అయితే దాన్ని నివారించవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని మనస్, అమెజానాస్ ఫెడరల్ యూనివర్శిటీకి చెందిన జీవశాస్త్రవేత్త మార్సెల్లో గోర్డో, ఆయన బృందం మూడు కోతులకు సంబంధించిన కుళ్ళిన శవాల నుంచి నమూనాలను సేకరించారు. వాటిపై పలు పరిశోధనలు జరిపారు.

ఆ నమూనాల్లో Parasitic Worms,వైరస్ లు, అంటువ్యాధులను వ్యాపించే బ్యాక్టీరియాలను కనుగొన్నారు. జీవశాస్త్రవేత్త అలెశాండ్రా నవా మాట్లాడుతూ.. మానవులు అడవులను ఆక్రమించుకుంటున్నారని, అందుకే జంతువులలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ ల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. చైనాలో కూడా ఇదే జరిగిందని ఆయన అన్నారు. అక్కడ నుండి ఉద్భవించిన వైరస్ కారణంగా, మిడిల్ ఈస్ట్ సిండ్రోమ్ వ్యాప్తి చెందింది. SARS-COV 2 కూడా అక్కడ నుంచే ఉద్భవించింది. మొదటి కరోనా కేసు చైనాలో బయటపడిందని గుర్తు చేశారు.

బ్రెజిల్‌కు చెందిన మనౌస్ చుట్టూ అమెజాన్ అడవులు ఉన్నాయి. వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిలో, ప్రపంచంలోని 12 శాతం జాతుల గబ్బిలాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా, అరుదైన ఎలుకలు, కోతి జాతులు కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ అనేక రకాల వైరస్ లు కూడా ఉన్నాయి. పట్టణీకరణ, అడవులను ఆక్రమించుకోవడం వల్ల, ఈ వైరస్ లు మానవులకు వ్యాపిస్తున్నాయి.. మహామ్మరిగా రూపాంతరం చెందుతున్నాయి.

అలెశాండ్రా, ఆమె బృందం జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వైరస్ లపై నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులను జునోసియాస్ అంటారని చెప్పారు. కాగా, కరోనా కారణంగా బ్రెజిల్ కూడా అల్లకల్లోలం అయింది. సెకండ్ వేవ్ కారణంగా ఆ నగరంలో ఇప్పటివరకు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..