British Woman: కవలలు అని ముగ్గురు తినే ఆహారం తింది… తీరా చూస్తే.. బాల భీముడికి జన్మనిచ్చింది.. ఎక్కడంటే

British Woman: ప్రపంచంలో విచిత్ర కేసులకు కొరత లేదు. చాలా సార్లు మన కళ్ళ ఎదురుగా జరిగినా ఇది నిజం అంటూ.. నమ్మడం కష్టం. ఇలాంటి ఓ వింత కేసు..

British Woman: కవలలు అని ముగ్గురు తినే ఆహారం తింది... తీరా చూస్తే.. బాల భీముడికి జన్మనిచ్చింది.. ఎక్కడంటే
Baby
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2021 | 2:21 PM

British Woman: ప్రపంచంలో విచిత్ర కేసులకు కొరత లేదు. చాలా సార్లు మన కళ్ళ ఎదురుగా జరిగినా ఇది నిజం అంటూ.. నమ్మడం కష్టం. ఇలాంటి ఓ వింత కేసు బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ షాక్‌కు గురిచేసింది. బ్రిటన్ కు చెందిన ఓ స్త్రీ తన గర్భంలో కవల పిల్లలు పెరుగుతున్నారని భావించింది. దీంతో తొమ్మిది నెలల పాటు.. ఆ మహిళ ముగ్గురు వ్యక్తుల ఆహారాన్ని తింది. అయితే మహిళ ప్రసవించే సమయంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆమె కవలలకు జన్మనివ్వలేదు.. కానీ చాలా లావుగా ఉన్న ఒక బాల భీముడు లాంటి పిల్లవాడికి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

UK లోని ఆక్స్ఫర్డ్ షైర్ కు చెందిన అంబర్ కంబర్లాండ్ అనే 21 ఏళ్ల మహిళ గర్భం దాల్చింది. ఆమె గర్భధారణ సమయంలో చాలా ఆకలిగా ఉందని చెప్పింది. దీంతో అంబర్ పరిస్థితిని చూసిన వారు ఆమె గర్భంలో కవల పిల్ల ఉన్నారని భావించారు. మహిళల నుండి వైద్యుల వరకు అందరూ అదే అభిప్రాయంలో ఉన్నారు. అంతేకాదు అంబర్ ప్రతిరోజూ సుమారు తొమ్మిది మంది తినే ఆహారం తినేది.. తీరా డెలివరీ సమయం వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు.

వైద్యులు కూడా షాక్ :

నివేదిక ప్రకారం… అంబర్ కౌ తన గర్భంలో తొమ్మిది నెలలు కవల బిడ్డలు ఉన్నారని భావించింది. . కానీ, బిడ్డ పుట్టినప్పుడు అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే, అంబర్ ఒకే బిడ్డకు జన్మనిచ్చింది. పిల్లల బరువు ఐదు కిలోల 800 గ్రాములు అని వైద్య సిబ్బంది చెప్పింది. అయితే అంబర్ విషయంలో వైద్యులు కూడా డైలమాలో పడిపోయారు. ఎందుకంటే ఆమె గర్భంలో కవల పిల్లలు పెరుగుతున్నారని వారు కూడా భావించారు. ఇప్పుడు ఈ విషయం లండన్ అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితే అంబర్ UK లో రెండవ భారీ శిశువుకు జన్మనిచ్చిన మహిళగా ఖ్యాతి పొందింది. 2012 సంవత్సరంలో ఇటువంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఆరున్నర కిలోల బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఇప్పుడు అంబర్ మళ్ళీ ఐదు కేజీల బలభీముడికి జన్మనిచ్చి.. రికార్డ్స్ లోకి ఎక్కింది.

Also Read: టేస్టీ టేస్టీ అటుకులు గుమ్మడియ వడియాల తయారీ విధానం ఎలా అంటే…