Grenade: పాలసీసాలు అనుకుని తీసుకోబోయారు.. కానీ..అవి రెండో ప్రపంచ యద్ధకాలం నాటి బాంబులు

భూమిలో వదులుగా పెట్టి ఉన్న సీసాలు చూసి వారు పాల సీసాలు అనుకున్నారు. వాటిని పైకి తీసి పెడదామని ప్రయత్నించారు. ఇంతలో అక్కడ దట్టంగా పొగ రావడం ప్రారంభమైంది.

Grenade: పాలసీసాలు అనుకుని తీసుకోబోయారు.. కానీ..అవి రెండో ప్రపంచ యద్ధకాలం నాటి బాంబులు
Explosion
Follow us
KVD Varma

|

Updated on: May 03, 2021 | 1:38 PM

Grenade: భూమిలో వదులుగా పెట్టి ఉన్న సీసాలు చూసి వారు పాల సీసాలు అనుకున్నారు. వాటిని పైకి తీసి పెడదామని ప్రయత్నించారు. ఇంతలో అక్కడ దట్టంగా పొగ రావడం ప్రారంభమైంది. అంతే..వాళ్ళు అక్కడి నుంచి పరార్. యూకే లోని హాంప్‌షైర్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. హాంప్‌షైర్‌లోని బ్రామ్‌డియన్‌కు చెందిన జేమ్స్ ఒస్బోర్న్ తన ఇంటికి కొంత దూరంలో కొన్ని సీసాలను చూశాడు. పాలసీసాల్లా కనిపిస్తున్న వాటిని భూమి నుంచి నేల మీద పెడదామని ప్రయత్నించాడు. కొన్ని బయటకు తీశాడు. ఇంతలో ఒక బాటిల్ నుంచి దట్టంగా పొగ రావడం మొదలైంది. వెంటనే పక్కకి జరిగిన అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతనికి అక్కడ కనిపించిన వస్తువులు తెల్లటి టాప్ మరియు దిగువన పసుపు ద్రవాన్ని కలిగి ఉండటంతో గందరగోళం ప్రారంభమైంది. ఇది చూసిన ఒస్బోర్న్, అతని స్నేహితుడు వాటిని పాల సీసాలు అని అనుకున్నారు.

నిజానికి ఆ ప్రాంతంలో ఎప్పుడూ ఒస్బోర్న్ చలిమంట వేసుకుంటూ ఉంటాడు. అక్కడ అతను 48 సీసాలను బయటకు తీశాడు. పోలీసులు వచ్చి వాటిని పరిశీలించి అవి గ్రెనేడ్ లుగా నిర్ధారించారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి వాటిని నిర్వీర్యం చేసింది. ఆ ప్రాంతంలో నాజీల దాడి నుండి గ్రామాలను రక్షించడానికి 1940 లలో పేలుడు పదార్థాలను దాచి ఉంచినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఒస్బోర్న్ తండ్రి ఆ స్థలాన్ని ఆ సమంలో ఆర్మీ తరహా హోమ్ గ్రౌండ్ సమూహాలకు అప్పగించారు. ”ఇది రెక్టర్ యొక్క ఇల్లు. ఇది గ్రామంలోని పురాతన భవనాలలో ఒకటి. ఇక్కడ రెక్టర్ నివసించారు కాబట్టి, ఇది స్థానిక హోమ్ గార్డ్ యొక్క ప్రధాన సమావేశ ప్రదేశాలలో ఒకటిగా ఉండవచ్చు” అని ఒస్బోర్న్ చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ గ్రనేడ్ పేలకుండా ఉంది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో అని ఆ తరువాత ఆయన చెప్పారు.

గత ఏడాది డిసెంబర్ లో కూడా ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో వంటగది లోపల బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో వంట గదిలో ఉన్న జోడీ క్రూస్, ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె ఇసాబెల్లా సజీవంగా ఉండటం అదృష్టం.

Also Read: కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ

Oxygen: భారత్‌కు సాయం కోసం ఆర్మీని రంగంలోకి దింపిన జర్మనీ.. ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌తో ఇండియాకు..