Telangana Municipalities Elections Results 2021 : తెలంగాణ పురపోరు ఫలితాల హైలైట్స్.. విజేతలు వీరే..!
Telangana Municipalities Elections 2021 Counting Updates: తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు పూర్తి. ఐదు మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ గులాబీ గుబాళించింది.
తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరిగింది . ఈ నెల 30న ఈ ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పూర్తైంది. సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ పురపాలికల్లో ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్‌లో ఒక్కో వార్డుకు లెక్కింపు చేపట్టింది ఎన్నికల సంఘం. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను లెక్కించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన తర్వాత.. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లు లెక్కించారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తి అయ్యింది.
LIVE NEWS & UPDATES
-
సిద్దిపేటలో గెలుపొందిన విజేతలు వీరే..
❁1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 3వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి 721 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 4 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత 612 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 5 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ 570 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయికుమార్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 7వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవీ 573 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత 411 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 9వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు ❁ 12వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా శ్రీనివాస్ యాదవ్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 13వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి విఠోభ గెలుపు ❁ 14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట కవిత గెలుపు ❁ 15వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పాతూరి సులోచన గెలుపు ❁ 16వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బర్ల మల్లికార్జున్ గెలుపు ❁ 16వ వార్డు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి రాధా గెలుపు ❁18వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అడ్డగట్ల కావేరి రేణుక గెలుపు ❁ 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి రవీందర్ గెలుపు ❁ 20వ వార్డు అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ రియాజుద్దీన్ ❁ 21వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఖాజా తబస్సుమ్ అక్తర్ గెలుపు ❁ 22 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల అరవింద్ రెడ్డి 179 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 23వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయకం లక్ష్మణ్ గెలుపు ❁ 24వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రాజనర్సు 719 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 25వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గుండ్ల యోగి గెలుపు ❁ 26వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కెమ్మసారం ప్రవీణ్ గెలుపు ❁ 27వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సద్ది నాగరాజు గెలుపు ❁ 28వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కలకుంట్ల మల్లికార్జున్ గెలుపు ❁ 29వ వార్డు ఎఐఎంఐఎం అభ్యర్థి విజయం ❁ 30వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ ఫాతిమా బేగం వజీర్ గెలుపు ❁ 31వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జంగిటి కనకరాజు 278 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 32వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బంధారం శ్రీలత రాజు గెలుపు ❁ 33వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ తస్లీమా బేగం మోహిజ్ 617 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 34వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్ 1023 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం ❁ 36వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం ❁ 37వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సాకీ బాలలక్ష్మి గెలుపు ❁ 38వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ధర్మవరం బ్రహ్మము 627 ఓట్ల మెజారిటీతో గెలుపు ❁ 39వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దీప్తి నాగరాజు 900 ఓట్ల మెజార్టీతో గెలుపు ❁ 40వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్ గెలుపు ❁ 41వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్నగారి సుందర్ గెలుపు ❁ 42వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం ❁ 43వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం
-
సిద్ధిపేట్ మున్సిపాలిటీలోనూ టీఆర్ఎస్ జయకేతనం
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 43 వార్డులకు గానూ 36 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. మిగిలిన 5 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు (రెబల్ ) , బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.
-
-
సిద్దిపేటలో కొనసాగుతున్న కారు జోరు
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 32 వార్డుల్లో గెలుపొందారు. మిగిలిన 7 వార్డుల్లో ఇతరులు అధిపత్యం కొనసాగిస్తున్నారు. ఇంకా 11 వార్డుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
-
గజ్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డులో టీఆర్ఎస్ గెలుపు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ12వ వార్డులో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నాయిని యాదగిరి 331 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
-
బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డులో టీఆర్ఎస్ విజయం
మున్సిపల్ ఉపఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారాం విజయం సాధించారు.
-
-
టీఆర్ఎస్ ఖాతాలో జడ్చర్ల మున్సిపాలిటీ
జడ్చర్ల మున్సిపాలిటీని అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 27 వార్డులకు గానూ 23 వార్డుల్లో విజయం సాధించింది. రెండు వార్డుల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండు వార్డుల్లో గెలుపొందాయి.
-
సిద్ధిపేట 4వ వార్డు అభ్యర్థి కన్నుమూత
సిద్దిపేట మున్సిపాలిటీ 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. నాల్గు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
-
పరకాల మున్సిపాలిటీ 9వ వార్డులో బీజేపీ విజయం
వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 9 వార్డులో 215 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణాచారి విజయం సాధించారు.
-
సిద్ధిపేట మున్సిపాలిటీలోనూ దూసుకెళ్తున్న కారు
సిద్దిపేట మున్సిపాలిటీలోనూ కారు జోరు కొనసాగుతోంది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి రౌండ్‌లో మొత్తం 21 వార్డుల ఓట్ల లెక్కించగా 19 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 17వ వార్డులో బీజేపీ, 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇంకా 22 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
-
అచ్చంపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే….
1 వ వార్డు – గౌరీశంకర్ (కాంగ్రెస్) 2 వ వార్డు – S నిర్మల (టీఆర్‌ఎస్) 3 వ వార్డు – సోమ్లా నాయక్ (టీఆర్‌ఎస్) 4 వ వార్డు – మహారాజ్ బేగం (టీఆర్‌ఎస్) 5 వ వార్డు – A లావణ్య (టీఆర్‌ఎస్) 6 వ వార్డు – గడ్డం రమేష్ (టీఆర్‌ఎస్) 7 వ వార్డు – నూరి బేగం (కాంగ్రెస్) 8 వ వార్డు – చిట్టెమ్మ (కాంగ్రెస్) 9 వ వార్డు – సుగుణమ్మ బీజేపీ 10 వ వార్డు – సునీత (కాంగ్రెస్) 11 వ వార్డు – M సంధ్య (కాంగ్రెస్) 12 వ వార్డు – ఖాజాబీ (టీఆర్‌ఎస్) 13 వ వార్డు – అంతటి శివ (టీఆర్‌ఎస్) 14 వ వార్డు – G శ్రీనివాస్ (కాంగ్రెస్) 15వ వార్డు మన్ను ప్రసాద్ (టీఆర్‌ఎస్) 16వ వార్డు ఎడ్ల నరసింహా గౌడ్ (టీఆర్‌ఎస్) 17వ వార్డు తగరం శ్రీను (టీఆర్ఎస్) 18వ వార్డు గోపిశెట్టి శివ (టీఆర్‌ఎస్) 19వ వార్డు శైలజ (టీఆర్‌ఎస్) 20వ వార్డు రమేష్ రావు (టీఆర్‌ఎస్)
-
అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ వశం
అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డుల్లో టీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
-
నకిరేకల్ మున్సిపాలిటీ విజేతలు వీరే…
✌ ఒకటో వార్డు – కందాల భిక్షం రెడ్డి (ఇండిపెండెంట్) ✌ రెండో వార్డు – సునీల్ కుమార్ (టీఆర్ఎస్) ✌ మూడో వార్డులో చింత స్వాతి త్రిమూర్తులు (టీఆర్ఎస్) ✌ నాలుగో వార్డు – గాజుల సుకన్య (కాంగ్రెస్) ✌ ఐదో వార్డు – వంటేపాక సోమలక్ష్మీ (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ) ✌ ఆరో వార్డు – మట్టిపల్లి కవిత (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ) ✌ ఏడో వార్డు – కొండ శ్రీను (టీఆర్ఎస్) ✌ ఎనిమిదో వార్డు – పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ) ✌ తొమ్మిదో వార్డు – చౌగోని రజిత (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ) ✌ పదో వార్డు – ఇ. సునీత (కాంగ్రెస్) ✌ 11వ వార్డు – మురారిశెట్టి ఉమారాణి (టీఆర్ఎస్) ✌ 12వ వార్డు – బానోతు వెంకన్న (టీఆర్ఎస్) ✌ 13వ వార్డు – సునీత (టీఆర్ఎస్) ✌ 14వ వార్డు – గడ్డం స్వామి (టీఆర్ఎస్) ✌ 15వ వార్డు – యసారపు వెంకన్న ✌ 16వ వార్డు – సైదులు (ఫార్వాడ్ బ్లాక్ పార్టీ) ✌ 17వ వార్డు – పల్లె విజయ్ (టీఆర్ఎస్) ✌ 18వ వార్డు – దైద స్వప్న రవీందర్ (కాంగ్రెస్) ✌ 19వ వార్డు – రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) ✌ 20వ వార్డు – రాములమ్మ (టీఆర్ఎస్)
-
నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కైవస్
నకిరేకల్ మున్సిపాలిటీని అధికార పార్టీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు.
-
అచ్చంపేటలో స్పీడ్ పెంచిన కారు
అచ్చంపేటలో టీఆర్ఎస్ ఖాతా తెరిచింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మున్సిపాలిటీలోని 4, 13, 16 వార్డులను టీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది. 4 వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
-
అచ్చంపేట 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం
అచ్చంపేట 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ 405 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
కొత్తూరులో రెండు టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 వార్డుల్లో విజయం
కొత్తూరు మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో trs – 2 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 2 వార్డులో విజయాన్ని అందుకుంది. ఇక్కడ 12 వార్డులకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
-
కొత్తూరు ఏడో వార్డులో TRS అభ్యర్థి విజయం
రంగారెడ్డి జిల్లా కొత్తూరు ఏడో వార్డులో TRS అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపును సాధించారు.
-
అచ్చంపేట ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం…
అచ్చంపేట ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాడు. కాంగ్రెస్ అభ్యర్థి గౌరీశంకర్ 130 ఓట్ల మెజార్టీతో గెలుపును అందుకున్నాడు. ఇదే తొలి ఫలితం అని చెప్పు కోవచ్చు. జడ్చర్ల, అచ్చంపేట పురపాలికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జడ్చర్ల డిగ్రీ కళాశాల, అచ్చంపేట జేఎంజే ఉన్నత పాఠశాలలో లో కౌంటింగ్ జరుగుతోంది.
-
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న లెక్కింపు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటలోపు రెండు చోట్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల పురపాలికలోని 27 వార్డుల్లో మొత్తం 112 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక అచ్చంపేట పురపాలికలోని 20 వార్డుల్లో 66 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
-
సిద్దిపేటలో అప్పుడు… ఇప్పుడు..
గడచిన మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో మొత్తం 34 స్థానాలుండగా అందులో TRS 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. 28 వార్డుల్లో ఎన్నికలు జరగగా TRS-16, BJP-2, కాంగ్రెస్-2, MIM-1, స్వతంత్రులు-07 చొప్పున సీట్లు కైవసం చేసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో ఆరుగురు TRS తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో అధికార TRS ఏకగ్రీవాల వ్యూహాన్ని అమలు చేయలేదు. అయినా చాలా వార్డుల్లో కులసంఘాలు, కాలనీ వాసులు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ TRSకు మద్దతుగా నిలిచారు. మొత్తం పట్టణంలో 1,00,678 ఓటర్లకు 67,539 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
సిద్దిపేటలో వేగంగా ఓట్ల లెక్కింపు..
సిద్దిపేటలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. బల్దియా పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో మరికాసేపట్లో తేలనుంది. దాదాపు 15 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. మళ్లీ TRS గెలుపును కొనసాగిస్తుందా.. ఇతర పార్టీలేవైనా పోటీలోకి వస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.
-
ముందుగా బ్యాలెట్ బాక్స్‌లు ఓపెన్ చేసి..
ముందుగా బ్యాలెట్ బాక్స్‌లు లెక్కింపు జరిగే చోటుకు తెచ్చి ఏజెంట్ల సమక్షంలో సీల్ తీస్తారు. బ్యాలెట్ పత్రాలను రెండు టేబుళ్లపై పోస్తారు. పత్రాలను తెరిచి అభ్యర్థుల గుర్తుల వారీగా ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేస్తారు.
-
ఓట్ల లెక్కింపు ఇలా చేస్తారు…
ముందుగా ఓట్ల లెక్కింపు ఇలా చేస్తారు.. పోస్టల్ బ్యాలెట్లను డివిజన్ల వారీగా లెక్కిస్తారు. ప్రతి డివిజన్‌కు రెండేసి టేబుళ్లుగా చేస్తారు. ప్రతి రౌండ్‌లో రెండు పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు.
-
ఒక్కొక్క వార్డుకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో…
నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీల్లోని ఒక్కొక్క వార్డుకు జరిగిన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
-
సరూర్‌నగర్ వీఎం హోంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది
గ్రేటర్ హైదరాబాద్‌లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ వీఎం హోంలో జరుగుతోంది. ఈ ఎన్నికలో పోటీకి టీఆర్ఎస్ దూరంగా ఉంది.
-
కొత్తూరు పురపాలికకు కేజీబీవీ పాఠశాలలో లెక్కింపు…
కొత్తూరు పురపాలికకు కేజీబీవీ పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి. తొలిసారి ఎన్నికలు జరిగిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43వార్డులకు గానూ 236 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
-
బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్కింపు..
జడ్చర్ల పురపాలిక లెక్కింపు బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతోంది. 27 వార్డులు ఉండగా.. 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అచ్చంపేట పురపాలిక లెక్కింపు.. జేఎంజే ఉన్నత పాఠశాలలో చేపట్టనున్నారు. ఇక్కడ 20 వార్డులకు సంబంధించి నాలుగు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.
-
మొదలైన మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మొదలైైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
-
మొదలైన ఓట్ల లెక్కింపు…
ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఖమ్మం, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ పురపాలికల కౌంటింగ్ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్‌లో ఒక్కో వార్డుకు లెక్కింపు మొదలైంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
-
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..
తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. వీటికి ఈ నెల 30న జరిగిన పోలింగ్‌కు సంబంధించి మరి కాసేపట్లో లెక్కింపు మొదలు కానుంది. వీటితో పాటే పలు మున్సిపాలిటీల్లోని వార్డులకు జరిగిన ఉప ఎన్నికల తీర్పు కూడా వెలువడనుంది.
Published On - May 03,2021 6:42 PM