Telangana Municipal Corporations Election Results 2021 Highlights: తెలంగాణ మినీ మున్సిపల్ ఫలితాలు.. వరంగల్, ఖమ్మం టీఆర్ఎస్‌దే..
Telangana Municipal Corporations Elections 2021 LIVE Counting and Updates: తెలంగాణ రాష్ట్ర మినీ మున్సిపల్ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు..
Telangana Municipal Corporations Elections 2021 Highlights: తెలంగాణ రాష్ట్ర మినీ మున్సిపల్ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అయితే ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు జీహెచ్‌ఎంసీ లింగోజిగూడ డివిజన్, పలు మున్సిపాలిటీలలో ఒక్కో వార్డుకు ఉపఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు కూడా సోమవారం వెల్లడి కానున్నాయి. అయితే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రావాలంటే కరోనా నెగెటివ్ రిపోర్టు తప్పకుండా ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి స్పష్టం చేశారు. అయితే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
గ్రేటర్ వరంగల్ మినీ మున్సిపల్ పోరు
గ్రేటర్ వరంగల్ మినీ మున్సిపల్ పోరులో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు నగరాలు, ఐదు పట్టణాల్లో ఏ పార్టీ పాగా వేయనుందో లేదో ఈ రోజు తేలిపోనుంది. అయితే గ్రేటర్ వరంగల్‌కు సంబంధించి నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో లెక్కింపు జరగనుంది. 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి.. లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను లెక్కిన్నారు.
ఖమ్మం మినీ మున్సిపల్ పోరు
మినీ మున్సిపల్ పోరులో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్.ఆర్. అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. 60 డివిజన్లకు గానూ 10వ డివిజన్‌ను టీఆర్‌ఎస్ ఏకగ్రీవం కాగా, 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. లెక్కింపు కోసం ప్రతి డివిజన్‌కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. మొత్తం 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్‌కు ఓ సూపర్ వైజర్‌ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ వీఎం హోంలో జరగనుంది. ఈ ఎన్నికలో పోటీకి టీఆర్‌ఎస్ దూరంగా ఉంది. నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీల్లోని ఒక్కొక్క వార్డుకు జరిగిన ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. కోవిడ్ కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. అయితే సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగెటివ్ రిపోర్టు వస్తేనే అనుమతించనున్నారు. ఇక మహబూబ్‌నగర్ జడ్చర్ల, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక జడ్చర్ల మున్సిపల్ ఓట్ల లెక్కింపు బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. 27 వార్డులు ఉండగా.. 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అచ్చంపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు జేఎంజే ఉన్నత పాఠశాలలో చేపట్టనున్నారు. ఈ మున్సిపల్‌లో 20 వార్డులకు సంబంధించి నాలుగు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. అలాగే కొత్తూరు మున్సిపల్ కేజీబీవీ పాఠశాలలో లెక్కింపు జరగనుంది. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి. తొలిసారి ఎన్నికలు జరిగిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43వార్డులకు గానూ 236 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
https://www.youtube.com/watch?v=rwLrqsnY27w
LIVE NEWS & UPDATES
-
ఖమ్మం కార్పొరేషన్ టీఆర్ఎస్‌దే..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ 46 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ -11, బీజేపీ -1, ఇతరులు -2 డివిజన్లలో గెలుపొందారు.
-
గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ కైవసం..
ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ 48 డివిజన్లలో గెలిచింది. బీజేపీ 10 డివిజన్లలో, కాంగ్రెస్ 4, ఇతరులు 4 డివిజన్లల్లో గెలిచారు.
-
-
ఖమ్మం కార్పొరేషన్ గులాబీ పార్టీదే..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ 43 డివిజన్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ -9, బీజేపీ -1, ఇతరులు -7 డివిజన్లలో గెలుపొందారు.
-
వరంగల్, ఖమ్మం టీఆర్ఎస్‌దే..
వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్లు గులాబీ పార్టీ టీఆర్ఎస్ వశమమయ్యాయి. వరంగల్‌లో ఇంకా నాలుగు స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఖమ్మంలో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
-
ఖమ్మంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్
ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకుంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. మరికొన్ని చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నాయి.
-
-
గ్రేటర్ వరంగల్..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. ఇప్పటివరకు 62 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకా నాలుగింటిలో ఫలితాలు రావాల్సి ఉంది.
-
వరంగల్ కార్పోరేషన్ టీఆర్ఎస్‌దే..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. ఇప్పటివరకు 62 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ 43 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 12 డివిజన్లలో, కాంగ్రెస్ 3, ఇతరులు 4 డివిజన్లలో విజయం సాధించారు.
-
ఖమ్మంలో టీఆర్ఎస్ ఆధిక్యం..
ఖమ్మం కార్పోరేషన్‌లోని 42 డివిజన్లల్లో కౌంటింగ్ ప్రక్రియం పూర్తయింది. కార్పోరేషన్‌లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకూ.. ఈ మున్సిపల్‌లో టీఆర్‌ఎస్, సీపీఐ కూటమి 33, బీజేపీ 1, కాంగ్రెస్ 6 స్థానాలు, ఇతరులు 2 డివిజన్లను గెలుచుకున్నాయి. మొత్తం 60 స్థానాలు ఉన్నాయి.
-
వరంగల్ కార్పోరేషన్‌లో 49 సీట్లల్లో కౌంటింగ్ పూర్తి..
వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్లల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 సీట్లల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ 33, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.
-
న్యాయం చేయండి.. ఖమ్మం 11వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి
ఖమ్మం కార్పొరేషన్ 11వ డివిజన్ బాక్సుల్లో ఇతర బ్యాలెట్ పత్రాలు ఉన్నాయని ఆ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించినందుకు కేంద్రం నుంచి బయటకు పంపారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలంటూ కౌంటింగ్ కేంద్రం ఎదుట బైఠాయించారు.
-
ఖమ్మం ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం..
11 డివిజన్ బ్యాలెట్ బాక్స్‌లో 24వ డివిజన్ ఓట్లు ఎలా వచ్చాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన నిర్వహించారు. ఈ డివిజన్‌లో.. రీపోలింగ్ నిర్వహించాలంటూ.. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ కౌంటింగ్ సెంటర్ ఎదుట ఆందోళన చేస్తున్నారు.
-
వరంగల్ కార్పోరేషన్‌లో 40 సీట్లల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి..
వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్లల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 40 సీట్లల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ 27, బీజేపీ 7, కాంగ్రెస్ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.
-
ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లల్లో కౌంటింగ్ వివరాలు.. ఇలా..
వరంగల్ కార్పోరేషన్‌లో మొత్తం 66 స్థానాలు వార్డులు ఉండగా.. ఇప్పటివరకు 39 స్థానాల్లో కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ 24, బీజేపీ 9, కాంగ్రెస్ 4, ఇతరులు 2 గెలుచుకున్నాయి. ఖమ్మం కార్పోరేషన్‌లోని 31 డివిజన్లల్లో కౌంటింగ్ పూర్తయింది. టీఆర్‌ఎస్ పార్టీ 22, బీజేపీ 1, కాంగ్రెస్ 7 స్థానాలు, ఇతరులు 1 గెలుచుకున్నాయి. మొత్తం 60 స్థానాలు ఉన్నాయి.
-
కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ..
ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్లల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఖమ్మంలో 31 డివిజన్లల్లో కౌంటింగ్ పూర్తవగా.. వరంగల్‌లో 39 స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
-
వరంగల్ కార్పోరేషన్లో.. 39 స్థానాలకు కౌంటింగ్ పూర్తి..
వరంగల్ కార్పోరేషన్‌లో మొత్తం 66 స్థానాలు వార్డులు ఉండగా.. ఇప్పటివరకు 39 స్థానాల్లో కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ 24, బీజేపీ 9, కాంగ్రెస్ 4, ఇతరులు 2 గెలుచుకున్నాయి.
-
ఖమ్మం కార్పోరేషన్‌లో 31 డివిజన్లలో కౌంటింగ్ పూర్తి..
ఖమ్మం కార్పోరేషన్‌లోని 31 డివిజన్లల్లో కౌంటింగ్ పూర్తయింది. ఈ కార్పోరేషన్‌లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. 3 గంటల వరకూ.. ఈ మున్సిపల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ 22, బీజేపీ 1, కాంగ్రెస్ 7 స్థానాలు, ఇతరులు 1 గెలుచుకున్నాయి. మొత్తం 60 స్థానాలు ఉన్నాయి.
-
ఖమ్మం 57వ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం
ఖమ్మం కార్పోరేషన్‌లోని 57వ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. పోలింగ్ రోజున ఈ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
-
వరంగల్ కార్పోరేషన్..
వరంగల్ కార్పోరేషన్‌లో మొత్తం 66 స్థానాలు వార్డులు ఉండగా.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 24, బీజేపీ 9, కాంగ్రెస్ 4, ఇతరులు 2 గెలుచుకున్నారు.
-
ఖమ్మం కార్పోరేషన్..
తెలంగాణలో ఖమ్మం కార్పోరేషన్‌లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకూ.. ఈ మున్సిపల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ 15, బీజేపీ 1, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 60 స్థానాలు ఉన్నాయి.
-
ఖమ్మం జిల్లా: ఖమ్మం కార్పొరేషన్ ఫలితాలు
43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించగా, 44 డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్‌థి విజయ గెలుపొందారు. అలాగే 55వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిని విజయం సాధించారు.
-
మధ్యాహ్నం 12 గంటల వరకు వరంగల్ మున్సిపల్ ఫలితాలు ఇలా..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులు మధ్యాహ్నం 12 గంటల వరకు టీఆర్‌ఎస్ 16, బీజేపీ 7, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానాలు కైవసం చేసుకున్నాయి.
-
మధ్యాహ్నం 12 గంటల వరకు ఖమ్మం ఫలితాలు ఇలా..
తెలంగాణ మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ జోరు కొనసాగిస్తోంది. ఇక ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ మున్సిపల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ 10, బీజేపీ 1, కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకున్నా
-
ఖమ్మం కార్పొరేషన్ ఫలితాలు
2వ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం గెలుపొందారు. 20వ డివిజన్ ఆర్‌ఎస్ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ విజయం సాధించారు. 25వ డివిజన్‌లో టీఆఎస్ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు. 43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు. 56వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపొందారు.
-
వరంగల్: కొనసాగుతున్న టీఆర్‌ఎస్ హవా..
వరంల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ 23 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 3, కాంగ్రెస్ 1 డివిజన్‌లో ఆధిక్యంలో ఉన్నాయి.
-
ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 3
ఖమ్మం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్ పార్టీ ఏడు డివిజన్లలో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒక డివిజన్‌లో గెలుపొందింది.
-
వరంగల్: 9వ వార్డులో బీజేపీ విజయం
పరకాల 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీలో 9వ వార్డులో 215 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి పూర్ణచారి గెలుపొందారు.
-
నకేరేకల్ మున్సిపల్ విజేతలు
నకేరేకల్ మున్సిపల్ ఒకటో వార్డులో 190 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం గెలుపొందారు. పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇ. సునీత 74 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాలుగో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి మేరేజ్ బేగం 84 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
నల్గొండ జిల్లా నకేరేకల్ మున్సిపల్‌లో గెలుపొంది వారు
నల్గొండ జిల్లా నకేరేకల్ మున్సిపాలిటీలోని రెండో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి సునీల్ కుమార్ 400 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాఏ నకేరేకల్ మున్సిపాలిటీలో13వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత విజయం సాధించారు.
-
ఖమ్మం మున్సిపల్ గెలుపొందిన వారు..
1వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ 7వ డివిజన్‌లో బీజేపీ సత్యనారాయణ 13వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ 25వ విడిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చంద్రకళ 31వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి 37వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార 55వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మోతారపు శ్రావణి
-
ఖమ్మం 13వ వార్డులో టీఆర్‌ఎస్ విజయం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు.
-
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
ఎన్నిల ఫలితాలు వెలువడిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనల అమలుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
-
ఖమ్మం మున్సిపల్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎస్సార్ బీజీఎన్నార్ కాలేజీలో ఈ లెక్కింపు నిర్వహిస్తున్నారు. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే10వ డివిజన్ అధికార టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం అయ్యింది. 10 కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒక్కో లెక్కింపు హాల్‌లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు
-
గ్రేటర్ వరంగల్ మున్సిపల్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాంపూర్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కౌంటింగ్ చేపడుతున్నారు. వరంగల్‌లో 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కిస్తున్నారు. ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్లు ఉన్నాయి. అయితే మొత్తం 132 టేబుళ్లలో కౌంటింగ్చేపడుతుండగా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
-
మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం
వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ పోరులో ఎవరు విజేతలు అవుతారో మధ్యాహ్నం వరకు తేలిపోనుంది. మళ్లీ టీఆర్‌ఎస్ గెలుపును కొనసాగిస్తుందా..? లేక ఇతర పార్టీలు కైవసం చేసుకుంటాయా? అనేది వేచి చూడాలి.
-
కరోనా నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి
మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా కరోనా నిబంధనలతో లెక్కింపు కొనసాగుతోంది. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుతించారు.
-
ఖమ్మంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
ఖమ్మం మినీ మున్సిపల్ పోరులో భాగంగా ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభమైంది.
-
వరంగల్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
తెలంగాణ మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమైంది.
-
గ్రేటర్ వరంగల్ మినీ మున్సిపల్ పోరు
గ్రేటర్ వరంగల్ మినీ మున్సిపల్ పోరులో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు నగరాలు, ఐదు పట్టణాల్లో ఏ పార్టీ పాగా వేయనుందో లేదో ఈ రోజు తేలిపోనుంది. అయితే గ్రేటర్ వరంగల్‌కు సంబంధించి నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో లెక్కింపు జరగనుంది. 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి.. లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
-
ఖమ్మం మినీ మున్సిపల్
ఖమ్మంలో..తెలంగాణలో మినీ మున్సిపల్ పోరులో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్.ఆర్. అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభమైంది. 60 డివిజన్లకు గానూ 10వ డివిజన్‌ను టీఆర్‌ఎస్ ఏకగ్రీవం కాగా, 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి.
-
కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న మినీ పురపోరు ఓట్ల లెక్కింపు
తెలంగాణలో మినీ పురపోరు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 30న జరిగిన పోలింగ్‌కు సంబంధించి మరి కొద్దిసేపట్లో లెక్కింపు ప్రారంభం కానుంది. వీటితో పాటే పలు మున్సిపాలిటీల్లోని వార్డులకు జరిగిన ఉప ఎన్నికల తీర్పు కూడా వెలువడనుంది.
Published On - May 03,2021 9:09 PM