AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID19 Vaccination: మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ వివరాలు వాట్సాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు… ఎలా అంటే..!

COVID19 Vaccination:కరోనా నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం ... మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని

COVID19 Vaccination: మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ వివరాలు వాట్సాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు... ఎలా  అంటే..!
Covid 19
Surya Kala
|

Updated on: May 03, 2021 | 5:59 PM

Share

COVID19 Vaccination:కరోనా నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం … మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రస్తుతం ఎలా వ్యాక్సినేషన్ సెంటర్స్ వివరాలు తెలుసుకోవాలి.. ఎలా నమోదు చేసుకోవాలనేది చాలామందికి తెలియడం లేదు.. అయితే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు.. మీరు ఉన్న ప్రాంతం నుంచే మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్‌ సెంటర్‌ల వివరాలు తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగా… సులభంగా వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌కు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయ పౌరునికి టీకా అందిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ఏప్రిల్‌ 28 నుంచే ప్రారంభించింది. అయితే, వ్యాక్సిన్‌ నమోదుకు మీ ఇంటికి దగ్గర్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల వివరాలు చాలా సులభంగా మీ స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ముందుగా మీ వాట్సప్‌లోని కరోనా హెల్ప్‌ డెస్క్‌ అయిన MYGOVలో ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అందుకు మొదట మీరు మీ వాట్సాప్‌ మొబైల్‌ ద్వారా ‘NAMASTE’ అని టైప్‌ చేసి 9013151515 నంబర్‌కు మెసేజ్ సెండ్ చేయాలి. అప్పుడు మీకు ఆటోమెటిక్‌గా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల లొకేషన్‌ను చూపిస్తుంది. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న టీకా సెంటర్‌ను ఎంచుకోవచ్చు.

అనంతరం మీరు, మీరు ఉంటున్న ఆరు అంకెల ఏరియా పిన్‌కోడ్‌ను టైప్‌ చేయాల్సి ఉంది.

దీంట్లో సెంటర్‌ వివరాలతో పాటు, రిజిస్ట్రేషన్‌ నమోదుకు లింక్‌ కోవిన్‌ ద్వారా చేసుకోవాలి.

ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా కూడా వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. హింది, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది. డిఫాల్ట్‌ ఆప్షన్‌ ద్వారా హిందిలో కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కరోనాకు సంబంధించిన సందేహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ వాట్సాప్‌ చాట్‌బట్‌ను గత ఏడాది మార్చి లో ప్రారంభించింది.

Also Read: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి