AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెంతి, ఉసిరితో కరోనా బహుపరార్..? ఒక్కసారి ట్రై చేయండి..! రిజల్ట్ మీకే తెలుస్తుంది..

Fenugreek and Amla Juice : కరోనా రెండో వేవ్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

మెంతి, ఉసిరితో కరోనా బహుపరార్..? ఒక్కసారి ట్రై చేయండి..! రిజల్ట్ మీకే తెలుస్తుంది..
Fenugreek And Amla Juice
uppula Raju
|

Updated on: May 03, 2021 | 10:50 PM

Share

Fenugreek and Amla Juice : కరోనా రెండో వేవ్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనాకు దూరంగా ఉండటానికి మాస్కులు, సామాజిక దూరం ఎంత ముఖ్యమో ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి పెంచుకోవడం కూడా ముఖ్యమే. ఈ శక్తి బలంగా ఉంటేనే మీరు కరోనాకు దూరంగా ఉండగలరు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి సారం, హెర్బల్ టీ, మల్టీ విటమిన్లు తీసుకోవడం అవసరం.

ఈ రోజు మనం ఉసిరి, మెంతి రసం గురించి తెలుసుకుందాం. ఈ రసం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రస్తుతం ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరిని బూస్టర్ అంటారు. ఇందులో విటమిన్ సి పెద్ద మొత్తంలో ఉంటుంది. అదనంగా మనకు కావలసిన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అయితే మార్కెట్లో లభించే ఉసిరి పౌడర్ వాడకుండా ఉండండి. ఎందుకంటే ఆ పౌడర్ ప్రాసెస్ చేయబడుతుంది.

మెంతిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి, మెంతి కలిపి తినడం వల్ల శరీరంలో ఐరన్ పరిమాణం పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఈ రసం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆమ్లా మరియు మెంతి రసం ఏ విధంగా రెడీ చేయాలంటే మొదటగా.. ఒక టీస్పూన్ మెంతి పొడి లేదా మెంతి ఆకులు, ఒక ఉసిరికాయ, అరగ్లాసు నీటిని తీసుకోండి. ఈ మూడింటిని కలిపి రుబ్బి పేస్ట్‌లా చేయండి. దానిని గ్లాసు నీటిలో వేసి మరిగించి వడకట్టి ప్రతి రోజూ ఉదయాన్నే త్రాగాలి. దీన్ని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ పానీయాన్ని భోజనంతో తీసుకోకండి. ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం తీసుకోవడం మంచిది.

మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‏కు జోడీగా ఆ హీరోయిన్ ?

Municipal Elections Result 2021: తెలంగాణ పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా.. అన్ని చోట్ల గులాబీ రెపరెపలు..