AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Long COVID Symptoms: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు

Long COVID Symptoms: కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనాతో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే.. మరి కొందరు..

Long COVID Symptoms: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు
Long Covid Symptoms
Subhash Goud
|

Updated on: May 03, 2021 | 9:57 AM

Share

Long COVID Symptoms: కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనాతో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే.. మరి కొందరు కరోనా నుంచి కోలుకున్నా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే ఇలా కోలుకున్నవారంతా పూర్తిగా బయటపడినట్లు కాదని, వారిలో చాలా మందికి దీర్ఘకాలికంగా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు లాంగ్‌ కోవిడ్ కూడా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, ప్రభుత్వరంగ ఆరోగ్య సంస్థలు ఈ ప్రమాదకరమైన వైరస్‌ దీర్ఘకాల ప్రభావాలపై అధ్యయనం చేశారు.

కరోనా బాధితులు ఆ వైరస్‌ బారి నుంచి కోలుకున్న తర్వాత కూడా నెగెటివ్‌ రిపోర్టు వచ్చినా కొంత మందిలో దీర్ఘకాలికంగా లక్షణాలు కనిపించడాన్ని లాంగ్‌ కోవిడ్‌ అంటారు. అంటే వారిలో కరోనా వైరస్‌ ఉండదు. కానీ దాని ప్రభావం మాత్రం వారిపై కొనసాగుతుందన్నట్లు. ఈ లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిలో ఊపిరితిత్తులు, గుండె, కీడ్నిలు, మెదడు లాంటి అవయవాలకు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇప్పటి వరకు లాంగ్‌ కోవిడ్‌కు సంబంధించి పూర్తిగా అవగాహన లేదు. చిన్న స్థాయి పిజీషియన్‌ కూడా రోగిలో కనిపిస్తున్నవి లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలా..? లేదంటే ఇతర వ్యాధి లక్షణాలా.? అనే విషయం గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. వీటిలో గతంలో ఎన్నడు లేని విధంగా ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఫాగ్‌ బ్రెయిన్‌ వంటివి కనిపిస్తే ఆ మూడు లాక్షణాలు లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు అయి ఉండవచ్చని అంటున్నారు.

ఛాతిలో నొప్పి ఉండటం..

సాధారణంగా కరోనా వైరస్‌ మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. కానీ ఛాతినొప్పి కూడా దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఛాతిలో అసౌకర్యంగా అనిపించడం, స్వల్పంగా నొప్పిగా ఉండటం లాంటివి లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు ఉండవచ్చని చెబుతున్నారు.

శ్వాసలో ఇబ్బంది

శ్వాసలో ఇబ్బంది అనిపించడం అనేది చాలా మంది కరోనా రోగుల్లో తలెత్తుతున్న సమస్య. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా సాధారణంగా నొప్పి అనిపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ లాంగ్‌ కోవిడ్‌ లక్షణం ఉన్నవాళ్లు సులభంగా శ్వాస తీసుకోలేకపోతారని నిపుణులు వెల్లడిస్తున్నారు.

బ్రెయిన్‌ ఫాగ్‌

కొంత మంది బాధితులు తమకు మత్తుగా, ఏదో తెలియని విధంగా అనిపించడం లాంటివి తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా లాంగ్‌ కోవిడ్‌ లక్షణమే. ఎందుకంటే కొంతమంది కరోనా బాధితులు కోలుకున్న తర్వాత మనసు ఏదోలా ఉండటం, షార్ట్‌ మెమోరీ లాస్‌ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో తేలింది.

లాంగ్‌ కోవిడ్‌తో ఎవరెవరికి ప్రమాదం

ఈ లాంగ్‌ కోవిడ్‌ లక్షణాల వల్ల కొందరిలో మాత్రం ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ కొలిన్స్‌ తెలిపారు. వృద్దులు, స్థూలకాయం ఉన్నవాళ్లు, మహిళలు ఈ లాంగ్‌ కోవిడ్‌ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.

ఇవీ చదవండి:

Coronavirus Myths: ముక్కులో నిమ్మ‌ర‌సం వేసుకుంటే క‌రోనా పోతుందా.? క‌ర్పూరంతో ఆక్సిజ‌న్‌.? వీటిలో నిజ‌మెంతా.?

ఈ ఆకులు టైప్ 2 డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధం..! రక్తంలో చక్కెర స్థాయిని అస్సలే పెరగనివ్వవు.. తెలుసుకోండి..