AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆకులు టైప్ 2 డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధం..! రక్తంలో చక్కెర స్థాయిని అస్సలే పెరగనివ్వవు.. తెలుసుకోండి..

Gudmar Plant : గుర్మార్ మొక్క ఆకులు, కాండం, వేర్లకు ఆయుర్వేదంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది అనేక వ్యాధులను నయం

ఈ ఆకులు టైప్ 2 డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధం..! రక్తంలో చక్కెర స్థాయిని అస్సలే పెరగనివ్వవు.. తెలుసుకోండి..
Gudmar Plant
uppula Raju
|

Updated on: May 02, 2021 | 11:54 PM

Share

Gudmar Plant : గుర్మార్ మొక్క ఆకులు, కాండం, వేర్లకు ఆయుర్వేదంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. గార్మార్‌ను ఔషధ తయారీకి కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఔషధం భారతదేశంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ సహా పలు రాష్ట్రాల్లో లభిస్తుంది. ఇది కాకుండా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, చైనా వంటి దేశాలలో కూడా ఇది కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తుంది.

గుర్మార్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అథెరోస్క్లెరోటిక్ లక్షణాలు ఉన్నాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారితో పాటు ఇతర వ్యాధులకు కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం.. గుర్మార్ ఆకులను తిన్న తర్వాత గంటలో తీపి రుచి మాయమవుతుంది. మీరు ఖాళీ కడుపుతో గుడ్మార్ ఆకులను నమలవచ్చు. ఆకులు తిన్న తరువాత ఒక గ్లాసు నీరు తీసుకోండి. ఇది మీ చక్కెర స్థాయిని తగ్గించడమే కాక రోజంతా చక్కెర స్థాయిని పెంచడానికి అనుమతించదు. మీరు రోజూ గుర్మర్ ఆకులను నమలవచ్చు.

గుర్మార్‌లో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి కొలొస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. గుర్మార్‌లో జిమ్నాస్టిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే ప్రోటీన్ యాంజియోటెన్సిన్ చర్యను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గుడ్‌మార్ చర్మానికి మేలు చేస్తుంది . గుడ్‌మార్ తీసుకోవడం ద్వారా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. దీని గుళికలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. గుడ్మార్ తినడం వల్ల చర్మంపై తెల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి.

కామెర్ల చికిత్సకు గుడ్‌మార్‌ను ఉపయోగిస్తారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోని గిరిజనులు కామెర్ల చికిత్స కోసం గుడ్మార్ ఆకులను తింటారు. ఉబ్బసం, కంటి సమస్య, మలబద్ధకం, అజీర్ణం, సూక్ష్మజీవుల సంక్రమణ, కార్డియోపతి, హైపర్‌ కొలెస్టెరోలేమియా మొదలైన వాటికి గుడ్‌మార్ ఉపయోగపడుతుంది.

ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉన్నాయి..! వర్షాలు పడుతాయా లేదా కరువా..? తెలుసుకోండి..

ఈ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారు..! అవును మీరు విన్నది నిజమే..? ఇది ఎక్కడ ఉందో తెలుసా..