Oxygen: భారత్‌కు సాయం కోసం ఆర్మీని రంగంలోకి దింపిన జర్మనీ.. ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌తో ఇండియాకు..

Oxygen Generation Plant: కరోనా మహమ్మారితో భారత్‌ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అత్యవసరంగా సాయం అందించడానికి జర్మనీ తన ఆర్మీని రంగంలోకి దింపింది...

Oxygen: భారత్‌కు సాయం కోసం ఆర్మీని రంగంలోకి దింపిన జర్మనీ.. ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌తో ఇండియాకు..
Follow us

|

Updated on: May 01, 2021 | 9:01 PM

Oxygen Generation Plant: కరోనా మహమ్మారితో భారత్‌ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అత్యవసరంగా సాయం అందించడానికి జర్మనీ తన ఆర్మీని రంగంలోకి దింపింది. ఆ దేశానికి చెందిన కల్నల్‌ డాక్టర్‌ థార్‌స్టెన్‌ వెబెర్‌ ఓ ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ తీసుకుని ఇండియాకు వస్తున్నారు. ఆయనతో పాటు ఓ టెక్నికల్‌ టీమ్‌ కూడా ఇండియా రానుంది. ఆ ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ పని చేయడంలో ఇండియాలోకి టెక్నీషియన్స్‌కు జర్మన్‌ టెక్నీషియన్లు సాయం చేయనున్నారు. భారత్‌కు అవసరం ఉన్నన్ని రోజులు ఈ ప్లాంట్‌ ఇక్కడే ఉంటుందని ఆయన వెబెర్‌ స్పష్టం చేశారు. ప్లాంట్‌తో పాటు మరో 120 వెంటిలేటర్లు కూడా జర్మన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎయిర్‌బస్‌లో ఇండియాకు వస్తున్నాయి.

శనివారం రాత్రే ఇవి న్యూఢిల్లీలో ల్యాండ్‌ కానున్నాయి. ఇవి భారత్‌లో దిగిన వెంటనే ఇక్కడి రెడ్‌క్రాస్‌ సొసైటీ, విదేశాంగ శాఖ సాయంతో అవసరమైన ప్రాంతానికి పంపిణీ కూడా చేస్తామని ఇండియా జర్మనీ రాయబారి వాల్టర్‌ లిండ్నెర్‌ చెప్పారు. అయితే గత వారమే ఇండియాకు జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కిల్‌ సంఘీభావం తెలిపారు. భారత్‌తో జర్మనీ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి హైకో మాస్‌ అన్నారు. కాగా, గురువారం ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్‌లతో ఉన్న తొలి కంసైన్‌మెంట్‌ జర్మనీ నుంచి ఇండియాకు వచ్చింది.

ఇవీ చదవండి:

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం

Covid-19: వాసన పరీక్షతో కరోనా గుర్తింపు.. సరికొత్త కిట్‌ను అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.. ఎలాగంటే..!