మే, జూన్‌ నెలల్లో ఉచిత రేషన్ సరుకులు..! మీ రేషన్ డీలర్ నిరాకరిస్తే ఇక్కడ ఫిర్యాదు చేయండి..? తెలుసుకోండి..

PM Garib Kalyan Yojana : దేశంలో తీవ్రతరం అవుతున్న కరోనా సంక్షోభం దృష్ట్యా మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నట్లు

మే, జూన్‌ నెలల్లో ఉచిత రేషన్ సరుకులు..! మీ రేషన్ డీలర్ నిరాకరిస్తే ఇక్కడ ఫిర్యాదు చేయండి..? తెలుసుకోండి..
Ration
Follow us
uppula Raju

|

Updated on: May 03, 2021 | 8:25 PM

PM Garib Kalyan Yojana : దేశంలో తీవ్రతరం అవుతున్న కరోనా సంక్షోభం దృష్ట్యా మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన్ మంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన పథకం కింద 5 కిలోల ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది దేశంలోని పేదలకు ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. మీకు రేషన్ కార్డు ఉంటే.. రేషన్ డీలర్లు మీ కోటా చెల్లించడానికి నిరాకరిస్తే మీరు టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ప్రతి రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను కలిగి ఉంది. మీరు మీ ఫిర్యాదును ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే మీకు కావాలంటే మీరు మెయిల్ కూడా చేయవచ్చు. NFSA వెబ్‌సైట్ https://nfsa.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. రేషన్ పంపిణీ వ్యవస్థ నుంచి అవాంతరాలను తొలగించడానికి, అందరికీ రేషన్ అందించడానికి ఫిర్యాదులు దాఖలు చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రేషన్ కార్డ్ హోల్డర్ తన ఫుడ్ కోటాను అందుకోకపోతే అతను ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

రేషన్ కార్డుదారులకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రయోజనాలు లభిస్తాయి. మీ రేషన్ కార్డులో నలుగురి పేర్లు నమోదు చేయబడిందంటే ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున మొత్తం 20 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ ధాన్యం ప్రతి నెల అందుకున్న రేషన్‌కు భిన్నంగా ఉంటుంది. అంటే ప్రతి నెలా రేషన్ కార్డులో ఐదు కిలోల ధాన్యం వస్తే మే, జూన్ నెలల్లో మీకు ఐదు కిలోల అదనపు ధాన్యాలు లభిస్తాయి. ఈ ఆహార ధాన్యాలు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపులోనైనా లభిస్తాయి. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

రాష్ట్రాల వారీగా ఫిర్యాదు చేయవలసిన హెల్ప్‌లైన్ నంబర్లు..

బీహార్ – 1800-3456-194, ఛత్తీస్‌గడ్ – 1800-233-3663, గోవా – 1800-233-0022, గుజరాత్ – 1800-233-5500, హర్యానా – 1800-180–2087, హిమాచల్ ప్రదేశ్ – 1800-180–8026, జార్ఖండ్ – 1800-345-6598, 1800-212-5512, కర్ణాటక – 1800-425-9339, కేరళ – 1800-425-1550, మధ్యప్రదేశ్ – 181, మహారాష్ట్ర – 1800-22-4950, మణిపూర్ – 1800-345-3821, మేఘాలయ – 1800-345-3670, మిజోరాం – 1860-222-222-789, 1800-345-3891, నాగాలాండ్ – 1800-345-3704, 1800-345-3705, ఒడిశా – 1800-345-6724 / 6760.

పంజాబ్ – 1800-3006-1313, రాజస్థాన్ – 1800-180-6127, సిక్కిం – 1800-345-3236, తమిళనాడు – 1800-425-5901, తెలంగాణ – 1800-4250-0333, త్రిపుర – 1800-345-3665, ఉత్తర ప్రదేశ్ – 1800-180-0150, ఉత్తరాఖండ్ – 1800-180-2000, 1800-180-4188, పశ్చిమ బెంగాల్ – 1800-345-5505, ఢిల్లీ – 1800-110-841, జమ్మూ – 1800-180-7106, కాశ్మీర్ – 1800-180–7011, అండమాన్ మరియు నికోబార్ దీవులు – 1800-343-3197, ఛండీగడ్ 1800-180–2068, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డియు – 1800-2334004, లక్షద్వీప్ – 1800-425-3186, పుదుచ్చేరి – 1800-425-1082, ఆంధ్రప్రదేశ్ – 1800-425 2977, అరుణాచల్ ప్రదేశ్ – 03602244290, అస్సాం – 1800-345-3611

మూడు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదల , కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన, కానీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిక

Covid-19: పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం.. యువతిని పొట్టనబెట్టుకున్న కరోనా..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!