మూడు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదల , కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన, కానీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిక

ఇటీవలి వరకు  అత్యధిక కేసులతో తల్లడిల్లిన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మూడు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదల , కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన, కానీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిక
Daily Covid Cases Decreased In 3 States
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 03, 2021 | 8:17 PM

ఇటీవలి వరకు  అత్యధిక కేసులతో తల్లడిల్లిన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఈ రాష్ట్రాల్లో రికవరీ రేటు 78 శాతం ఉండగా నేటికి  ఇది సుమారు 82 శాతానికి పెరిగిందని ఈ శాఖ తెలిపింది. అయితే ఇవి తొలి సూచికలు మాత్రమేనని, గట్టి విశ్లేషణతో ఇవి  తగ్గినట్టు  నిర్దిష్టంగా ప్రస్తుతానికి చెప్పజాలమని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, చండీ గఢ్, బీహార్, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి పలు రాష్టాలు   వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తక్షణం గట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ రాష్టాల్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కర్ణాటకలో రెండు గంటల్లో  24 మంది రోగులు మరణించినట్టు వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తున్నాయన్నారు. అయితే ఆక్సిజన్ కొరతతో వారు మరణించారా లేక ఇతర అనారోగ్య కారణాలతోనా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా సోమవారం నాటికీ దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 24 గంటల్లో 3.68 లక్షల కేసులు నమోదయ్యాయి. 3,417 మంది రోగులు మరణించారు.

కానీ ఢిల్లీలో మరణ మృదంగం మోగుతోంది. గత శనివారం నగరంలో 412 మంది, ఆదివారం 400 మంది రోగులు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 30 శాతం కన్నా తగ్గింది. దేశంలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 2.18 లక్షలకు చేరుకుంది. ఇలా ఉండగా బ్రిటన్ నుంచి 60 వెంటిలేటర్లతో కూడిన నాలుగో కన్ సైన్ మెంట్ సోమవారం ఇండియాకు చేరుకుంది. త్వరలో మరిన్ని వైద్య పరికరాలు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు భారత్ కు పంపనున్నామని ఆ దేశం ప్రకటించింది. అలాగే అమెరికా నుంచి కూడా మరింత సాయం అందనుంది. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు చేరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19: పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం.. యువతిని పొట్టనబెట్టుకున్న కరోనా…

AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత… 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి