Covid-19: పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం.. యువతిని పొట్టనబెట్టుకున్న కరోనా..

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి కోరలుచాస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి నిత్యం వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. లాక్షలాది మంది

Covid-19: పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం.. యువతిని పొట్టనబెట్టుకున్న కరోనా..
Young Woman Die With Covid 19
Follow us

|

Updated on: May 03, 2021 | 8:15 PM

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి కోరలుచాస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి నిత్యం వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. లాక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. సాధారణ ప్రజల నుంచి అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పదిరోజుల్లో పెళ్లి కావాల్సిన యువతిని కూడా కరోనా మహమ్మారి బలితీసుకుంది. కొద్దిరోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపడంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. 10 రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఉప్పల్‌ భరత్‌ నగర్‌కి చెందిన కె.అనంతయ్య కూతురు.కె శ్రీవాణి (22)కి ఈ నెల 13 వివాహం జరగాల్సి ఉంది. దీంతో కుటుంబమంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై హడావుడిలో ఉంది.

ఈ నేపథ్యంలోనే శ్రీవాణి అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించగా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 21న ఆమెను ఎల్బీనగర్‌‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శ్రీవాణి శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణాలు కోల్పోయింది. మరో పది రోజల్లో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

Also Read:

Co-WIN Slot Notifier: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.? స్లాట్ ఖాళీల కోసం ఈ సైట్లు సందర్శించండి.!

Mamata Banerjee: మమత పోటీ చేసేది అక్కడ్నించే.. తృణమూల్ సీటు నుంచే బరిలోకి దీదీ

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ