AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stalin administration: ఎల్లుండి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం కానీ అప్పుడే స్టాలిన్ ఏం చేశాడంటే?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన డిఎంకే అధినేత స్టాలిన్.. ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకముందే చర్యలకు ఉపక్రమించారు. పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే తానేంటో.. తన అడ్మినిస్ట్రేషన్ ఏంటో చాటేందుకు...

Stalin administration: ఎల్లుండి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం కానీ అప్పుడే స్టాలిన్ ఏం చేశాడంటే?
Stalin
Rajesh Sharma
|

Updated on: May 05, 2021 | 5:34 PM

Share

Stalin administration starts even before swearing in: తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన డిఎంకే అధినేత (DMK CHIEF) స్టాలిన్ (STALIN).. ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకముందే చర్యలకు ఉపక్రమించారు. పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే తానేంటో.. తన అడ్మినిస్ట్రేషన్ ఏంటో చాటేందుకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను అవగతం చేసుకుని తదనుగుణంగా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మే 2వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో తమిళనాడు (TAMILNADU) అసెంబ్లీలోని 234 సీట్లకు గాను.. ఏకంగా 134 సీట్లను సొంతంగాను.. 159 సీట్లను డిఎంకే కూటమి (DMK ALLIANCE) ద్వారాను గెలుచుకున్న స్టాలిన్ మే 7వ తేదీన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి (TAMILNADU CHIEF MINISTER)గా ప్రమాణం చేయనున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ (STALIN) అప్పుడే పాలనపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి (CHIEF MINISTER)గా బాధ్యతలు చేపట్టేలోపే ప్రభుత్వ పాలనలో మునిగిపోయారు. కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే డిమాండ్‌పై అనేకసార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. డీఎంకే అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న నర్సులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న దశలో వైద్యులు (DOCTORS), నర్సులు (NURSES), ఇతర సిబ్బంది సేవలు ఎంతో అవసరంగా మారిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్ (RAJEEV RANJAN), ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ (DR RADHAKRISHNAN) స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న 1,212 మంది నర్సుల ఉద్యోగాలను పర్మనెంట్‌ చేయనున్నట్లు స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని.. అంకిత భావంతో కరోనా విధులు నిర్వహించాలని స్టాలిన్‌ నర్సులను కోరారు. తమిళనాడులో పనిచేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ (CORONA FRONT-LINE WARRIORS)గా పరిగణిస్తామని స్టాలిన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విలేకరుల సేవలను కొనియాడారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుతూ తగిన రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తమిళనాడులో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు స్టాలిన్ మేనిఫెస్టో (MANIFESTO) విడుదల చేశారు. ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్​ సహా ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులు, హిందువులపై వరాల జల్లు కురిపించింది. తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు కంప్యూటర్ ట్యాబ్లెట్లు సహా ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కల్పిస్తామని ప్రమాణం చేసింది.మెరుగైన వసతులు..చిన్న రైతులకు సబ్సిడీలు, మెరుగైన నీటి పారుదల వ్యవస్థ, సురక్షిత మంచినీటి సరఫరా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ల పెంపు, వృద్ధుల పింఛను మొత్తాలను పెంచుతామని డీఎంకే వాగ్ధానం చేసింది.

ALSO READ: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..