DANGEROUS CORONA: ఏపీలో డేంజరస్ కరోనా వైరస్.. కొత్త రకం కరోనా వెరైటీతో సీమాంధ్రలో ప్రమాద ఘంటికలు

ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ ఇపుడ ఏపీలో విస్తరిస్తోంది. కర్నూలులో నమోదైన కొత్త రకంగా...

  • Updated On - 6:42 pm, Wed, 5 May 21 Edited By: Ravi Kiran
DANGEROUS CORONA: ఏపీలో డేంజరస్ కరోనా వైరస్.. కొత్త రకం కరోనా వెరైటీతో సీమాంధ్రలో ప్రమాద ఘంటికలు
Corona In Ap

DANGEROUS CORONA VARIANT IN ANDHRA PRADESH: ఏపీ (AP)లో కొత్త రకం కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు (SCIENTISTS) అభివర్ణిస్తున్న ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ (CORONA VIRUS) ఇపుడ ఏపీలో విస్తరిస్తోంది. కర్నూలు (KURNOOL)లో నమోదైన కొత్త రకంగా ఎన్440కే (N440K) వేరియెంట్ కరోనా వైరస్ ఇపుడు ఏపీవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. అందుకే ఏపీలో ప్రతీ రోజూ 20 వేల దాకా కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CORONA VIRUS POSITIVE CASES) నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో (TELUGU STATES) ముఖ్యంగా ఏపీలో కరోనా భారీగా విస్తరించడానికి కారణం ఏమిటి? ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? కరోనా కేసులు భారీ స్థాయిలో పెరగడానికి ఎన్440కె వేరియంటే కారణమా? … ఇటువంటి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు 20 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్‌లో ఎన్440కే వేరియంట్ 10 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణుల పరిశోధనలో తేలింది. హైదరాబాద్‌ (HYDERABAD), ఘజియాబాద్‌ (GHAZIABAD)లకు చెందిన శాస్త్రవేత్తలు తాజా పరిణామాలపైనా.. కొత్త రకం కరోనా వేరియెంట్‌ (CORONA VARIENT)పైనా పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనా ఫలితాలను వెల్లడించారు.

ఇప్పటి వరకూ దేశంలో ఏ2ఏ స్ట్రెయిన్‌ (A2A STRAIN)గా పిలు   వబడుతున్న వైరస్‌ అత్యధికంగా వ్యాప్తిలో ఉన్నది. ఏ2ఏ స్ట్రెయిన్‌లో జరిగిన జన్యు మార్పుల వల్ల ఏర్పడినదే కొత్త వైరస్‌ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ2ఏ స్ట్రెయిన్‌ సోకిన వారి కంటే ఎన్‌440కె బారిన పడిన వారిలో వైరస్‌ లోడ్‌ 10 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏ3ఐ స్ట్రెయిన్‌ రకంతో పోల్చితే ఎన్‌440కె బారిన పడిన వారిలో 1000 రెట్లు ఎక్కువ వైరల్‌ లోడ్‌ కనిపిస్తుందంటున్నారు. అందువలనే దీని బారినపడే వారిలో ఇన్ఫెక్షన్‌ (INFECTION) తీవ్రత ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. అమెరికా (AMERICA), జర్మనీ (GERMANY)లలో కూడా ఎన్‌440కె వేరియంట్ల వలనే అత్యధిక నష్టం జరిగిందంటున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో ప్రాంతాల వారీగా రకరకాల కరోనా వేరియంట్లు (CORONA VARIANTS) వ్యాప్తిలో వున్నాయి. ఉత్తరాదిలో ఒక రకం.. దక్షిణాదిలో మరో రకం కరోనా వైరస్‌ ఎక్కువగా కనిపిస్తోంది.

పశ్చిమ భారత దేశ ప్రాంతంలో ఇంకో రకం కరోనా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ (DELHI), పంజాబ్‌ (PUNJAB), ఉత్తరప్రదేశ్‌ (UTTAR PRADESH), హరియాణా (HARYANA)ల్లో యూకే  (UK)రకం వైరస్‌ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బి.1.617, 618 వైరస్‌లు ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది ఉత్తరాది రాష్ట్రాల్లో. ఇక గత రెండు నెలలుగా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర (MAHARASHTRA)లో డబుల్‌ మ్యూటెంట్‌ (DOUBLE MUTANT) రకం విస్తృతి కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో అత్యధిక కేసులకు కొత్త రకంగా కరోనా వైరస్ కారణమవుతోందని చెబుతున్నారు. కానీ ఈ రకం వైరస్‌ నిజానికి గత అక్టోబర్‌లోనే గుర్తించారు. అప్పట్లో కర్నూలులో మొదటిసారి గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌440కె వేరియంట్ వైరస్‌ ఇప్పటికే రాష్ట్రంలో 30 శాతం వ్యాపించిందని కొందరు చెబుతున్నారు. ఈ కొత్త వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని తమ వద్ద గట్టి సమాచారం ఉందని అంటున్న నేతలు.. జగన్ ప్రభుత్వం (JAGAN GOVERNMENT) సరైన చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రంలో ప్రాణనష్టం అపారంగా వుంటుందని వాదిస్తున్నారు.

ఈ ప్రచారంపై స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. కొత్త స్ట్రెయిన్‌ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై తాము సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్తలను సంప్రదించామని వెల్లడించారు. ఎన్‌440కె కొత్తగా వచ్చిన కరోనా వైరస్ వేరియెంట్ కాదని, గత సంవత్సరం జులై-అగస్టులకు సంబంధించినదిగా సీసీఎంబి శాస్త్రవేత్తలు చెప్పారని సింఘాల్‌ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో కొన్ని రోజులుగా భారీ స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కూడా ఈ వైరస్‌ వ్యాప్తిలో ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ (TELANGANA)లో కేసుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా కనబడటానికి పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటమే కారణమని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి వైద్య వర్గాలు.

ALSO READ: ఎల్లుండి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం కానీ అప్పుడే స్టాలిన్ ఏం చేశాడంటే?

ALSO READ: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో