Covid-19 third wave: కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపైనే అత్యధిక ప్రభావం.. ఉద్ధవ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Pediatric Wards: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్

Covid-19 third wave: కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపైనే అత్యధిక ప్రభావం.. ఉద్ధవ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Corona Pandemic
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 05, 2021 | 6:21 PM

Pediatric Wards: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ ముప్పు తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల వరకు నమోదవుతుండగా.. మరణాలు దాదాపు నాలుగువేలకు చేరువలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ థర్డ్ వేవ్ అత్యధికంగా పిల్లలపై ప్రభావం చూపే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బ‌ృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ( బిఎంసి ), మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలో, ఇతర ప్రాంతాలలో పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డులను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించాయి.

ఈ కరోనా మ్యుటేషన్లు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో పీడియాట్రిక్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గత వారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్‌ను నియంత్రించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా కరోనా పిల్లలను దెబ్బతీసే అవకాశముందని ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు.

కాగా.. మహరాష్ట్రలో ఇటీవల కాలంలో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. భారీగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో కొనసాగుతోంది. కరోనా నియంత్రణ కోసం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటోంది.

Also Read:

Supreme Court to Centre: ఆక్సిజన్‌ కొరతపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌.. ముంబైని చూసి నేర్చుకోండంటూ హితవు

Covid-19 third wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదా..? సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ సలహదారు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..