Gomathi Marimuthu: భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మారిముత్తుకు షాక్… నాలుగేళ్ల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సీఎఎస్ నిరాకరణ
భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మారిముత్తుకు మరోసారి చుక్కెదురైంది. తన నిషేధాన్ని ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని సీఎఎస్ తిరస్కరించింది.
Gomathi Marimuthu: భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మారిముత్తుకు మరోసారి చుక్కెదురైంది. తన నిషేధాన్ని ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని సీఎఎస్ తిరస్కరించింది. . 2019 లో నిషేధిత డ్రగ్స్ తీసుకుని డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోయింది. దీంతో ఆమెను అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఎఐయు) నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా భారత రన్నర్ గోమతి మారిముత్తు చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సిఎఎస్) తోసిపుచ్చింది.
2019 అథ్లెటిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన గోమతి మారిముత్తు నిషేధిత డ్రగ్స వాడినట్లు గుర్తించారు. దీంతో ఆమెను నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది ఎఐయు. ఇది మే 2019 నుండి ప్రారంభమై 2023 మేతో ముగుస్తుందని ఎఐయు తెలిపింది. నిషేధాన్ని అనుభవిస్తున్నప్పుడు, ప్రపంచ అథ్లెటిక్స్ మంజూరు చేసిన ఏ ఈవెంట్‌లోనైనా భారత రన్నర్ పోటీ చేయడానికి వీలు లేదని పేర్కొంది. మార్చి 18 నుండి 2019 మే 17 వరకు ఆమె సాధించిన విజయాలన్నిని కూడా రద్దు చేసింది. 32 ఏళ్ల రన్నర్ 2019 లో జరిగిన దోహా ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. అయితే తరువాత ఆమె పతకాన్ని తొలగించారు. ఆమె 2 నిమిషాల 02.70 సెకన్ల సమయంలో సాధించారు. టైటిల్ గెలుచుకున్న వ్యక్తిగత ఉత్తమ రికార్డు ఆమె సొంతం.
ఆసియా అథ్లెటిక్స్ సందర్భంగా గోమతితో పాటు పలువురు భారతీయ అథ్లెట్ల నమూనాలను అధికారులు సేకరించారు. అయితే, ఆమె నమూనాల్లో అనాబాలిక్ స్టెరాయిడ్ వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దోహా ఆసియా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన 2019 పాటియాలా ఫెడరేషన్ కప్‌లో తమిళనాడు రన్నర్ డోప్ పరీక్షలో కూడా విఫలమయ్యారు. ఫెడరేషన్ కప్ సందర్భంగా ఆమె సానుకూల ఫలితాన్ని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది. అప్పటికే ఆమె ఖండాంతర పోటీల్లోనూ పాల్గొంది.