ఆస్ట్రేలియా క్రికెటర్ కిడ్నాప్.. నిందితుల్లో గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు.. అసలేం జరిగిందంటే..?

Stuart Macgill Kidnap: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ స్టువర్ట్ మెక్‌గిల్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు..

  • Ravi Kiran
  • Publish Date - 3:57 pm, Wed, 5 May 21
ఆస్ట్రేలియా క్రికెటర్ కిడ్నాప్.. నిందితుల్లో గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు.. అసలేం జరిగిందంటే..?
Stuart Macgill

Stuart Macgill Kidnap: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ స్టువర్ట్ మెక్‌గిల్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు గంటల పాటు కారులో తిప్పారు. గుర్తు తెలియని ప్రదేశానికి అతణ్ని తీసుకెళ్లి దాడి చేశారు. గన్ తో బెదిరించారు. ఈ ఘటన రెండు వారాల క్రితం సిడ్నీలో చోటు చేసుకుంది. నిందితుల అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు నిందితుల్లో ఒకరు మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే కావడం విశేషం.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారినో సొటిరోపౌలోస్‌తో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. మారినో చెల్లెలితో మెక్‌గిల్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కొద్దిరోజుల పాటు మూడోకంటికి తెలియకుండా డేటింగ్‌ చేశారు. ఈ విషయం మారినోకు తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు.

ఏప్రిల్‌ 14, రాత్రి 8 గంటలకు మెక్‌గిల్‌ క్రెమోర్నేలో గొడవకు దిగాడు. మరో ఇద్దరు అతడికి తోడయ్యారు. మెక్‌గిల్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. వెంటనే బ్రింగెల్లీ అనే చోటుకు తీసుకెళ్లారు. అతడిని తుపాకీతో బెదిరించారు. అరగంట తర్వాత బెల్‌మోర్‌ ప్రాంతానికి తీసుకెళ్లి విడుదల చేశారు. రెండు రోజులు భయపడ్డ మెక్‌ గిల్‌ ఏప్రిల్‌ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మ్యాన్ హంట్ ప్రారంభించారు. మూడు వారాల తరువాత నిందితులను అరెస్ట్ చేశారు. మిన్హ్ ఎన్‌గుయెన్, ఫ్రెడ్రిక్, రిచర్డ్ స్కార్ఫ్ సహా మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ వెనుక మారినో ఉన్నట్లు నిర్ధారించారు. ఆరు రోజుల తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అందుకే నిందితులను అరెస్ట్ చేయడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. మెక్‌ గిల్‌ లెగ్‌స్పిన్నర్‌. ఆస్ట్రేలియా తరఫున 1998-2008వ సంవత్సరంలో ఆడాడు. 44 టెస్టుల్లో 208 వికెట్లు తీశాడు.

Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌