Corona: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్
Curfew And Weekend Lockdown: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు..
Curfew And Weekend Lockdown: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పనిచేయడం లేదని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నిలువరించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేశారు.
కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని దేశాన్ని అప్రమత్తం చేశారు. సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక పరిష్కారం అన్నారు. కరోనా కేసులు తగ్గేందుకు లాక్‌డౌనే ఉత్తమ మార్గమని తెలిపారు. కరోనా కట్టడికి ఆయన మూడు మార్గాలు సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలుపెంచాలి. ఉప్పెనలా దూసుకురాబోతున్న మూడో వేవ్ కట్టడికి వ్యాక్సిన్లు వేగం పెంచాలి. మూడవది ప్రజల మధ్య దూరం పెంచాలి ‘ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు రోజువారీ కార్మికుల గురించి ఆలోచన చేయాలి. నిర్ణీత కాలం పాటు లాక్‌డౌన్ విధించాలి. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించాలి’ అని సూచించారు.
Also Read:
Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?
Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!