AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, అధికారులను జైల్లో పెడతామనడం సరి కాదని వ్యాఖ్య

ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంతగా కృషి చేస్తున్నాయని, అలాంటప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు అధికారులను జైల్లోపెడతామనడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, అధికారులను జైల్లో పెడతామనడం సరి కాదని వ్యాఖ్య
Delhi High Court
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 05, 2021 | 6:42 PM

Share

ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంతగా కృషి చేస్తున్నాయని, అలాంటప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు అధికారులను జైల్లోపెడతామనడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 24 గంటల్లో ఢిల్లీకిఆక్సిజన్ ను సరఫరా చేయాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తామని ఢిల్లీ హైకోర్టు నిన్న కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని కేంద్రం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది.ఏమైనా ఢిల్లీ నగరానికి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందేలా చూసేందుకు రేపు ఉదయానికల్లా సమగ్ర ప్లాన్ ను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ముంబై తరహాలో ప్రాణ వాయువు లభ్యతకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు జస్టిస్ వైవీ చంద్రచూడ్, జుస్టిస్ షా లతో కూడిన బెంచ్ సూచించింది. ఆక్సిజన్ పరిస్థితిని హైకోర్టు మానిటరింగ్ చేయకుండా ఆపాలన్న అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సమన్వయంగా ఉండే అధికారులను జైల్లో పెట్టడమో లేదా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని వేధించడమో సరికాదని, దీనివల్ల ప్రయోజనం లేదని,ఢిల్లీకి ఆక్సిజన్ లభించదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.700 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును ఎలా, ఏ విధంగా అందజేస్తారన్న దానిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రేపు ఉదయం పదిన్నర గంటలకల్లా తమకు సమర్పించాలని వారు ఆదేశించారు. మీరు ఢిల్లీ ప్రజలకు జవాబుదారిగా ఉండాలని అంతే తప్ప కోర్టు ధిక్కార ప్రొసీడింగులను తాము కోరడంలేదని బెంచ్ పేర్కొంది. 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తో ఢిల్లీ నెట్టుకు రాగలదని కేంద్రం చెప్పగా ..బెంచ్ దీన్ని అంగీకరించలేదు. 700 టన్నులు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది.అయితే తాము ఇందుకు ప్రయత్నిస్తున్నామన్న కేంద్రం వ్యాఖ్యను కోర్టు స్వాగతించింది. కేంద్రం తనవంతు కృషి చేస్తున్నట్టు కనిపిస్తోందని జస్టిస్ షా అన్నారు. మీరు ఒకవేళ మరో రాష్ట్రం నుంచి ఆక్సిజన్ తెచ్చినా ఆ రాష్ట్రానికి నష్టం వాటిల్లదా అని ఆయన ప్రశ్నించారు. అటు ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీ ఆసుపత్రుల్లో 40 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు.

 మరిన్ని ఇక్కడ చూడండి: DANGEROUS CORONA: ఏపీలో డేంజరస్ కరోనా వైరస్.. కొత్త రకం కరోనా వెరైటీతో సీమాంధ్రలో ప్రమాద ఘంటికలు

Covid-19 third wave: కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపైనే అత్యధిక ప్రభావం.. ఉద్ధవ్ ప్రభుత్వం కీలక నిర్ణయం