వ్యాక్సిన్ వృధాను తగ్గించారు, కేరళ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ప్రశంస, ఇతర రాష్ట్రాలు పాటించాలని సూచన
ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ వృధా కాకుండా తగ్గించినందుకు కేరళ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు.
ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ వృధా కాకుండా తగ్గించినందుకు కేరళ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కోవిడ్ పై పోరులో ఇలాగే అన్ని రాష్టాలూ సహకరించాలన్నారు. మీ రాష్ట్ర నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ వేస్టేజీని తగ్గించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథాకు సంబంధించి డేటాను విజయన్ ప్రధానంగా ప్రస్తావించారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి 73,38,806 డోసుల వ్యాక్సిన్ అందిందని, తాము 74,26,164 డోసులను అందజేశామని ఆయన పేర్కొన్నారు. అదనంగా లభ్యమైన డోసులను కూడా మా నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు వినియోగించారని ఆయన వెల్లడించారు. ఇందుకు వారిని ఎంతగానో అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటివరకు 17.2 కోట్ల డోసుల టీకామందును ఉచితంగా ప్రొవైడ్ చేసిందనిఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో 36 లక్షలకు పైగా డోసుల టీకామందును వీటికి పంపుతామని తెలిపింది. కాగా వ్యాక్సిన్ ని వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఓ ఆర్టీఐ యాక్టివిస్టుకు అందిన సమాచారంలో తెలిసింది. ఈ రాష్ట్రం 8.83 శాతం వేస్టేజీతో మొదటి స్థానంలో ఉండగా అస్సాం (7.7 శాతం), మణిపూర్ (7.44), హర్యానా 5.72 శాతం తో ఉన్నట్టు వెల్లడైందిఇదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూపీ రాష్ట్రాలు కూడా టీకామందును వృధా చేశాయని అందువల్ల ఈ రాష్ట్రాల అధికారులు పరిస్థితిని సమీక్షించాలని ప్రధాని మోదీ వీటికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ఇలా వ్యాక్సిన్ ని వృధా చేసే రాష్ట్రాలకు దీని కోటాను తగ్గించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యాక్సిన్ డోసుల్లో చాలాభాగం ప్రైవేటు ఆసుపత్రులకు, అర్హత లేని వ్యక్తులకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు కేంద్రం దృష్టికి వచ్చాయి.పరిస్థితి ఇలాగే కొనసాగితే మీకు పంపే కోటాలో కోత ఉండవచ్చునని కేంద్రం పరోక్షంగా సూచించినట్టు తెలిసింది.ప్రస్తుత పరిస్థితుల్లో టీకామందు వృదాను సహించలేమని కూడా కేంద్రం పేర్కొందట.
మరిన్ని ఇక్కడ చూడండి: అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!
Pooja Hegde: కోవిడ్‌ను జయించిన పూజా హెగ్డే… స్టుపిడ్ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..