AP Corona: ఏపీలో కరోనా విలయం.. గత 24గంటల్లో 22వేలకుపైగా కేసులు.. మురణాలు ఎన్నంటే..?
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో 22వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,16,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 22,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. 12,03,337 కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 8,374 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షన్నరకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఉదయం వేళ కూడా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వాహనాలను అడ్డుకొని వెనెక్కి పంపించారు. దీంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.
Also Read: