బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. కేవైసీ అప్డేట్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ… వారికి బెనిఫిట్..
RBI Announces About KYC: బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది ఆర్బీఐ. దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
RBI Announces About KYC: బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది ఆర్బీఐ. దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు కాస్తా ఊరట కలగనుంది. కేవైసీ నిబంధనలను సవరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇక దీంతో బ్యాంక్ ఖాతాదారులకు చాలా బెనిఫిట్ కలగనుంది. ఇక బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కేవైసీ రూల్స్ ను సవరిస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తీ కాంత దాస్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవైసీ అప్ డేట్ పై నిబంధనలను సవరించినట్లుగా తెలిపారు. పెండింగ్లో ఉన్న కస్టమర్ల ఖాతాల కోసం.. అలాగే కస్టమర్స్ అకౌంట్స్ సంబంధించిన కార్యకలాపాల కోసం కేవైసీ అప్ డేట్ చేయయడమనేది తప్పనిసరని గతంలో సూచించిన సంగతి తెలిసిందే.
బ్యాంకులు కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని కస్టమర్లను ఇటీవల కోరాయి. ఇందుకోసం మే 31 వరకు గడువును విధించాయి. ఈ సమయంలోపు కేవైసీ వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ మాత్రం కేవైసీ అప్ డేట్ గడువును డిసెంబర్ చివరి వరకు పొడగిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే మే 31 లోపు కేవైసీ అప్ డేట్ చేసుకోకపోయినా పర్లేదు. దీని వలన మీ అకౌంట్ల కార్యకలపాలు నిలిచిపోవు. సాధారణంగానే మీ అకౌంట్స్ పనిచేస్తాయి. డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్ డేట్ చేసుకోకపోయిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరంతరంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కాగా ఇప్పటికే పలు బ్యాంకులు మే 31 లోపు కేవైసీ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని తమ కస్టమర్లను అలర్ట్ చేశాయి.
Also Read: Covid Care: బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్నవారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా..
కోవిడ్ ఎఫెక్ట్.. వాటిని కొనేవాడే లేడు.. వెలవెలబోతున్న షాప్స్.. దిక్కుతోచని స్థితిలో యాజమానులు..