కోవిడ్ ఎఫెక్ట్.. వాటిని కొనేవాడే లేడు.. వెలవెలబోతున్న షాప్స్.. దిక్కుతోచని స్థితిలో యాజమానులు..

వేసవి ప్రారంభం నుంచే మరోసారి కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభిస్తోంది. దీంతో రోజుకీ బారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఎయిర్ కండిషనర్స్,

కోవిడ్ ఎఫెక్ట్.. వాటిని కొనేవాడే లేడు.. వెలవెలబోతున్న షాప్స్.. దిక్కుతోచని స్థితిలో యాజమానులు..
Air Conditioners
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2021 | 6:55 PM

వేసవి ప్రారంభం నుంచే మరోసారి కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభిస్తోంది. దీంతో రోజుకీ బారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఎయిర్ కండిషనర్స్, కూలర్లు వంటి వ్యాపారాలను కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బకొట్టిందని బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదిక తెలిపింది. జనవరి నుంచి జూన్ నెలల మధ్యలో ఎయిర్ కండిషనర్ అమ్మకాలు 70% వరకు జరుగుతాయి. ఈ కాలంలో ఏసీ వాడకం కూడా పెరుగుతుంది. సంవత్సరంలో 70% అమ్మకాలు జనవరి నుంచి జూన్ నెలలోనే జరుగుతాయని నివేదికలో తెలిపారు. మార్చి నుంచి మే వరకు మూడు నెలల కాలంలో వీటి అమ్మకాలు 50% ఉంటుంది. ఈ కాలంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే పరిశ్రమలపై వీటి ప్రభావం భారీగానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఏసీలు కోనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని.. అయినా కంపెనీలు మాత్రం సాంకేతికంగా వీటి కోనుగోలుకై చూస్తున్నాయని నిపుణులు అన్నారు.

అలాగే వేసవి ప్రారంభంలోనే వీటి ధరలను అధికంగా పెంచేసాయి పరిశ్రమలు. దీంతో ప్రస్తుత పరిస్థితులలో వీటి అమ్మకాలు భారీగానే తగ్గిపోయాయి. ఇక వేగంగా విజృంబిస్తున్న కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిపై మరింత ప్రభావం చూపించనుంది. ఇక వీటి అమ్మకాల విలువ సౌత్ ఇండియాలో కొంత మెరుగ్గా ఉంది. గత సీజన్ల కంటే ఈ ఏడాది మెరుగ్గా ఉన్నట్లుగా నివేదికలో వెల్లడైంది. తక్కువ తక్కువ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని మింట్ ప్రచురించింది. ఎయిర్ కండిషనర్లు, కూలర్లకు పెద్ద పోర్ట్ ఫోలియో ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఇక కేంద్రం పై లాక్ డౌన్ ప్రతిపాదన ఒత్తిడి పెరుగుతుందని.. ఒకవేళ లాక్ డౌన్ విధించాల్సి వస్తే వీటి అమ్మకాలపై మరింత నష్టం చేకూరుతుంది.

Also Read: జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మెగా మేనల్లుడు.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..

Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..