SBI: పొరబాటున కూడా ఈ తప్పులు చేయకండి.. కస్టమర్లకు ఎస్‌బీఐ కీలక సూచనలు
SBI Alert: ఆధునిక ప్రపంచంలో.. డిజిటల్ లావాదేవీలు పెరగడంతోపాటు.. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట
SBI Alert: ఆధునిక ప్రపంచంలో.. డిజిటల్ లావాదేవీలు పెరగడంతోపాటు.. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట సైబర్ నేరాల కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం పదుల సంఖ్యలో వినియోగదారులు సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు, పోలీసులు సైతం వినియోగదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లవలలో పడకూడదంటే.. ఇలాంటి సూచనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు ఎస్‌బీఐ సైతం నిత్యం వినియోగదారులకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంది. తాజాగా అనవసర యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవద్దంటూ ఎస్‌బీఐ ట్విట్ చేసింది. సైబర్ మోసగాళ్ల పట్ట అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌లో ఎలాంటి సున్నితమైన వివరాలను ఇతరులకు పంచుకోవద్దని సూచించింది. ముఖ్యంగా తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, వీటివల్ల సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయంటూ వివరించింది. ఆ మేరకు పలు సూచనలు చేసింది.
ఎస్‌బీఐ ట్విట్..
We advise our customers to be alert of fraudsters and not to share any sensitive details online or download any app from an unknown source.#StaySafe #StaySecure #BeAlert #CyberSecurity #CyberSafety pic.twitter.com/J8S6dxRpjq
— State Bank of India (@TheOfficialSBI) May 4, 2021
ఇదిలాఉంటే.. ఇటీవల క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంప వద్దంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సలహా ఇచ్చింది. క్యూఆర్ కోడ్‌తో పే చేయడానికి షాపుల్లోని క్యూఆర్ కోడ్‌లు మాత్రమే వాడొచ్చని, డబ్బులు పంపడానికి కాదని వెల్లడించింది. ఆన్‌లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్లలో ఎక్కువగా క్యూఆర్ కోడ్‌ల ద్వారానే జరుగుతున్నాయని.. సైబర్ మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని.. జాగ్రత్తగా వహించాలని ఎస్‌బీఐ హెచ్చరించింది.
Also Read: