AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పే ఫిక్సేషన్ గడువు పెంచుతూ మోదీ సర్కార్ ఉత్తర్వులు.. స్థిర చెల్లింపులు పొందేందుకు అప్షన్లు

కేంద్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. పే ఫిక్సేషన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పే ఫిక్సేషన్ గడువు పెంచుతూ మోదీ సర్కార్ ఉత్తర్వులు..  స్థిర చెల్లింపులు పొందేందుకు అప్షన్లు
Central Extends Pay Fixation Deadline
Balaraju Goud
|

Updated on: May 04, 2021 | 5:27 PM

Share

Good News for Government Employees: కేంద్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. పే ఫిక్సేషన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ కీలక నోటిఫికేషన్ జారీ చేసింది.

పే ఫిక్సేషన్ గుడువను మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ఊరట లభించనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రానికి డెడ్‌లైన్ పొడిగించాలని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు స్పందించిన నరేంద్ర మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పే ఫిక్సేషన్ గడువు పొడిగింపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి తేదీ ఆధారంగా స్థిర చెల్లింపు పొందాలా? లేదా ఇంక్రిమెంట్ తేదీ ఆధారంగా స్థిర చెల్లింపు పొందాలా? అనే ఆప్షన్ ఎంచుకోవడానికి ఎక్కువ గడువు అందుబాటులోకి వచ్చింది. మళ్లీ గడువు పొడిగింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. వీటన్నింటిని కలిపి ఒకేసారి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల డీఏ భారీగా పెరగనుంది. 28 శాతానికి చేరొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also…  మీ ఇంటికి సమీపంలో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి!