నాలుక కోసి ఏకంగా అమ్మవారికి నైవేద్యం పెట్టింది..! ఈమెది మామూలు అభిమానం కాదు.. చచ్చిపోయేంత..?
Women Cuts Her Tongue : తమిళనాడులో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంకే పార్టీ గెలిచి ప్రభుత్వం
Women Cuts Her Tongue : తమిళనాడులో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంకే పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే ఒక మహిళ చేసిన పని ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. డీఎంకే పార్టీ, నాయకుడు స్టాలిన్ పై ఈమె చూపించిన అభిమానం వెలకట్టలేనిది. ఏకంగా తన నాలుకను కోసి అమ్మవారికి నైవేద్యం పెట్టింది. ఒక వ్యక్తిని అభిమానిస్తే ఇంతలా ఆరాధిస్తారా అని అందరూ షాక్ అవుతున్నారు.
32 ఏళ్ల వనిత అనే మహిళ డీఎంకే పార్టీకి వీరాభిమాని. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే తన నాలుకను నైవేద్యంగా పెడుతానని ముత్తలమ్మాన్ అమ్మవారికి మొక్కుకుందట. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయి డీఎంకే 133 సీట్లు సంపాదించి ఇంకా తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 159 స్థానాలతో అధికారంలోకి వస్తోంది. దీంతో వనిత తెగ సంబరపడిపోయింది.
దీంతో అనుకున్నట్లుగానే మొక్కు తీర్చుకోవడానికి ముత్తలమ్మాన్ అమ్మవారి ఆలయానికి వెళ్లింది. అయితే కరోనా నేపథ్యంలో ఆలయం మూసివేసి ఉండడంతో గేటు బయట నిల్చుని తన నాలుక కోసుకుంది. తెగిన నాలుకను అమ్మవారికి నైవేద్యంగా గేటు బయట పెట్టేసి వెళ్లిపోయింది. ఆమె నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.