అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని..! కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం కావాలన్నా..? ఈటల మాటలు..

Eatala Rajendar Coments : తెలంగాణ గాంధీగా పేరు గాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ తనపై కక్ష్య సాధిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే ఈటల

  • uppula Raju
  • Publish Date - 6:24 pm, Tue, 4 May 21
అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని..! కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం కావాలన్నా..? ఈటల మాటలు..
Eatala Rajendar Coments

Eatala Rajendar Coments : తెలంగాణ గాంధీగా పేరు గాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ తనపై కక్ష్య సాధిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అసైన్డ్ భూములకు సంబంధించి తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని, కుట్ర పూరితంగా వ్యవహరించారని అన్నారు. హుజూరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరో చెప్పిన తప్పుడు సలహాలు విని తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

తన పద్దతి నచ్చకపోతే పిలిపించి అడిగితే తానే రాజీనామా చేసేవాడినన్నారు. సీఎం కేసీఆర్ తర్వాత అతడి కుమారుడు కేటీఆరే సీఎం కావాలని కోరుకున్నానని చెప్పాడు. అంతేకానీ తాను ఎప్పుడు సీఎం కావాలని అనుకోలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే అనుమతించలేదని పేర్కొన్నారు. ఆ సందర్భంలో మంత్రి గంగుల కమలాకర్‌ తనతో ఇంత అహంకారమా అంటూ మాట్లాడారని గుర్తు చేశారు.

తనతో ఉండే సహచరులే ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. వ్యక్తులు ఉంటారు.. పోతారు.. కానీ ధర్మం ఎక్కడికీ పోదని, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తానని చెప్పారు. ఒక మనిషికి ఒక పార్టీ, వ్యక్తితో మాట్లాడే అవకాశముండదా? 2014 కంటే ముందు కాంగ్రెస్‌ మంత్రుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి పనులు తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా వాళ్లు తెరాస మంత్రులను కలవడానికి వస్తే అప్పుడే ఫిక్స్‌ అయిపోయిందా?అంటున్నారని తెలిపారు.

రాజకీయ విషయంలో అన్ని వర్గాలతో చర్చిస్తానన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు తనకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ఆర్ఐల అండదండలు నిరంతరం అందించాలని కోరారు. సిట్టింగ్ జడ్జీలతో తన మొత్తం వ్యాపారం మీద సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించండి అని సీఎంని కోరినట్లుగా ఆయన ఎన్‌ఆర్‌ఐలకు గుర్తు చేశారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనని ఈటల మరోసారి స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలిపిన ప్రవాస భారతీయులకు ఈటల ధన్యవాదాలు తెలియజేశారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారతదేశంలోని ఈ నగరాల్లో 5 జి పరీక్షకు అనుమతి…

Drishyam 2: హిందీలోనూ ‘దృశ్యం 2’.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..

జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మెగా మేనల్లుడు.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..