‘అమ్మ క్యాంటీన్’ బోర్డులను ఎత్తి పడేస్తున్న డీఎంకే కార్యకర్తలు, సస్పెండ్ చేసిన పార్టీ నాయకత్వం
తమిళనాడులో ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం సాధించగానే ఇక ప్రభుత్వం తమ పార్టీదే అని చెలరేగిపోయిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు చెన్నై 'అమ్మ క్యాంటీన్ ' బోర్డులను తొలగించి కింద పడేశారు....
తమిళనాడులో ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం సాధించగానే ఇక ప్రభుత్వం తమ పార్టీదే అని చెలరేగిపోయిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు చెన్నై ‘అమ్మ క్యాంటీన్ ‘ బోర్డులను తొలగించి కింద పడేశారు. ఈ దృశ్యం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారు క్యాంటీన్ లోని కూరగాయలను, వంట పాత్రలను కూడా కింద పడేసి చెల్లాచెదరు చేశారు. అమ్మ (జయలలిత) చిత్రంతో కూడిన బోర్డులను తొక్కుకుంటూ వెళ్ళాడో కార్యకర్త.. అయితే వీరి ‘ఘన కార్యానికి’ పార్టీ నాయకత్వం ఆగ్రహించి పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేసింది. తమ పార్టీ అధినేత స్టాలిన్ ఆదేశంపై తాము ఈ కార్యకర్తలమీద పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు వారిని అరెస్టు చేశారని ఈ పార్టీ నేత, చెన్నై మాజీ మేయర్ అయిన సుబ్రమణ్యన్ మీడియాకు తెలిపారు. క్యాంటీన్ లో ఈ బోర్డులు ఎక్కడ ఉన్నాయో మళ్ళీ అక్కడ పెట్టించినట్టు ఆయన చెప్పారు. ఈ విధమైన చర్యలను తాను సహించబోనని స్టాలిన్ పేర్కొన్నారని, వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారని ఆయన తెలిపారు. అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు ఈ కార్యకర్తల దుందుడుకు చర్యలు చూస్తూ కూడా కామ్ గా ఉండిపోయారు.
ఎవరో తమ మొబైల్ లో ఈ వీడియో చిత్రీకరించారు. అటు అన్నా డీఎంకే కూడా ఈ ఫోటోలను షేర్ చేసింది. తమిళనాడులో ఇప్పటికీ అమ్మ క్యాంటీన్లు చాలా పాపులర్.. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ నెల 7 వ తేదీ ఉదయం 7 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగాలని ఆయన సూచించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో డీఎంకే పదేళ్ల విజన్ డాక్యుమెంటును విడుదల చేస్తామన్నారు. పదేళ్ల అనంతరం తిరిగి రాష్టంలో డీఎంకే అధికారంలోకి వస్తోంది. సాధారణంగా ఇన్నేళ్ల తరువాత పార్టీ అధికార పగ్గాలను చేబడుతున్న సందర్భంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకునేది. కానీ సెకండ్ కోవిడ్ వేవ్ వాటికి అడ్డుకట్ట వేసింది.
சென்னை ஜெ.ஜெ.நகர் அம்மா உணவகத்தில் இருந்த ஊழியர்களை உருட்டு கட்டையால் தாக்கி திமுகவினர் கொலைவெறி தாக்குதல். pic.twitter.com/96QwTMWFOP
— AIADMK (@AIADMKOfficial) May 4, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.
ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.