Drishyam 2: హిందీలోనూ ‘దృశ్యం 2’.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..

Drishyam 2 Remake: రీసెంట్ గా ఓటీటీలో రిలీజై సూపర్‌ హిట్‌ కొట్టిన చిత్రం‘దృశ్యం 2’. మోహనల్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్‌ డైరెక్షన్..

  • Ravi Kiran
  • Publish Date - 6:21 pm, Tue, 4 May 21
Drishyam 2: హిందీలోనూ ‘దృశ్యం 2’.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..

Drishyam 2 Remake: రీసెంట్ గా ఓటీటీలో రిలీజై సూపర్‌ హిట్‌ కొట్టిన చిత్రం‘దృశ్యం 2’. మోహనల్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ… ‘పనోరమ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్ర హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని వల్ల దృశ్యం 2 కథ చాలామంది ప్రేక్షకులకి దగ్గరవుతుంది’ అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, సాంకేతిక వర్గ వివరాలన్నీ తెలియనున్నాయి.

ఇదిలా ఉంటే ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్‌ దేవగణ్‌, శ్రియ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో రీమేక్‌ అవుతోంది. వెంకటేశ్‌, మీనా ప్రధాన పాత్రల్లో మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్నారు.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!