AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మెగా మేనల్లుడు.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..

Vaishnav Tej: మెగా కాంపౌండ్ నుంచి ఉప్పెనలా దూసుకొచ్చిన హీరో.. వైష్ణవ్ తేజ్. ఫస్ట్ ఫిల్మ్ తోనే సక్సెస్‏ను టేస్ట్ చేసిన ఈ హాట్ షాట్ కోసం.

జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మెగా మేనల్లుడు.. మరో  మూవీకి గ్రీన్ సిగ్నల్..
Vaishnav Tej
Rajitha Chanti
|

Updated on: May 04, 2021 | 6:16 PM

Share

Vaishnav Tej: మెగా కాంపౌండ్ నుంచి ఉప్పెనలా దూసుకొచ్చిన హీరో.. వైష్ణవ్ తేజ్. ఫస్ట్ ఫిల్మ్ తోనే సక్సెస్‏ను టేస్ట్ చేసిన ఈ హాట్ షాట్ కోసం.. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. వరుసగా కథలు వింటున్న వైష్ణవ్.. చిరంజీవిని డేసీషన్ మేకర్‏గా ముందుంచినట్లుగా సమాచారం. అయితే వచ్చే రెండేళ్ల పాటు.. వైష్ణవ్ డేట్స్ దొరికే ఛాన్సే లేదని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా విడుదలైన ఉప్పెన.. తెలుగునాట సెన్షేషన్ హిట్ కొట్టింది. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి మొదటి సినిమాతోనే తమ అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‏తో.. అదరగొట్టారు. దీంతో ఈ మూవీ విడుదలకు ముందే.. డైరెక్టర్ క్రిష్ తో వైష్ణవ్ ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘ఉప్పెన’ విడుదల కావడంతో పాటు.. కరోనా రావడంతో ఈ మూవీ రిలీజ్‏ను పోస్ట్ పోన్ చేశారు.

అలాగే సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ మూవీ దర్శకుడు గిరీశయ్యతో.. వైష్ణవ్ తన మూడో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ నెల కిందటే మొదలైనా.. దీనికి కూడా కరోనా బ్రేక్ వేసింది. మరోవైపు టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్‏కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రణవ్.. వైష్ణవ్‏తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నట్లు ఇంతకుముందే వెల్లడించారు. అంతేకాకుండా.. ఛలో, భీష్మ చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ కుడుముల సైతం.. వైష్ణవ్‌తో ఓ సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే చిరంజీవితో పాటు.. వైష్ణవ్ కు కూడా కథను వినిపించాడట. ఈ కలయికలో కూడా త్వరలోనే ఓ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఇలా వరుస సినిమాలతో వైష్ణవ్ ఫుల్ బిజీ అయిపోయాడు.

Also Read: సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..

కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..