AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..

Nithiin New Movie: చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. చివరిగా ఈ యంగ్ హీరో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు.

వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..
Nithin
Rajitha Chanti
|

Updated on: May 04, 2021 | 10:07 PM

Share

Nithiin New Movie: చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. చివరిగా ఈ యంగ్ హీరో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చి ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ చిత్రాలు ప్రేక్షకుల్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే నితిన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా చకచక సినిమాలను చేసేస్తున్నాడు నితిన్. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన అందాధున్ చిత్రానికి రీమేక్‏గా నిర్మిస్తున్నారు. ఇక ఇది సెట్స్‌పై ఉండగానే నితిన్‌ మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్‌ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరు ఉంది. ఆయన కథలను అందించిన సినిమాలు కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి.  ఇక ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మించనున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని అనుకుంటున్నారట మేకర్స్. ప్రస్తుతం నితిన్‌ చేస్తున్న ‘మ్యాస్ట్రో’ పూర్తి కాగానే.. ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కనున్నారట. ఇదిలా ఉంటే… ఇటీవల నితిన్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే చైతన్య కృష్ణ దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా చేయబోతున్నట్లుగా టాక్ నడిచింది. ఇవే కాకుండా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కూడా నితిన్ ఓ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ నితిన్ మ్యాస్ట్రో తర్వాత ఏ సినిమాను పట్టాలెక్కించనున్నాడో చూడాల్సిందే.

Also Read: కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..

కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ తారలు.. 300 మంది కోవిడ్ రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..