జర్నలిస్ట్‌గా మారనున్న అవికాగోర్.. రియల్ లైఫ్ ? లేదా రీల్ లైఫ్ అంటూ .. సందేహంలో ఫ్యాన్స్..

Avika Gor: అవికా గోర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరలో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‏తో

  • Rajitha Chanti
  • Publish Date - 10:27 pm, Tue, 4 May 21
జర్నలిస్ట్‌గా మారనున్న అవికాగోర్.. రియల్ లైఫ్ ? లేదా రీల్ లైఫ్ అంటూ .. సందేహంలో ఫ్యాన్స్..
Avika Gor

Avika Gor: అవికా గోర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరలో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‏తో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైన అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‏గానూ మెప్పించింది. ఇక ఈ సినిమ తర్వాత అవికా.. తెలుగులో వరుసగా.. సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత అవికాకు తెలుగులో అంతగా ఆఫర్లు రాలేదు. తాజాగా సమాచారం ప్రకారం అవికా గోర్ జర్నలిస్ట్‏గా మారనుందట. ఈ విషయాన్ని తన సన్నిహితులే చెప్పెస్తున్నారు. దీంతో అవికా అభిమానులు మొదట్లో ఆశ్చర్యపోయినా.. తర్వాత రియల్ లైఫ్ లోనా లేదా రీల్ లైఫ్ లోనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అందరికి షాక్ ఇస్తూ అసలు విషయాన్ని చెప్పెశారు సినీ వర్గాలు.. ఈ అమ్మడు జర్నలిస్ట్‌గా నిజంగా మారడంలేదు.. కేవలం సినిమా కోసం మాత్రమే జర్నలిస్ట్ గా మారబోతుందట.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… అవికాగోర్‌ ప్రస్తుతం ఆదిసాయికుమార్‌తో సజ్జా వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1’లో జర్నోగా నటిస్తోంది. అవును బల్‌వీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఓ కేసుని శోధించే జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించనుంది. అలా ఆ కేసును శోదిస్తున్న క్రమంలో ఆమెకు ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే అవికా.. కరోనా సెకండ్ వేవ్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. అవికా కుటుంబ సభ్యులు కూడా కరోనా భారిన పడ్డారు. ప్రస్తుతం వారందరూ కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక అవికా సోషల్ మీడియా వేదికగా కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..

కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..