కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..
Sandeep Kishan: ప్రస్తుతం యావత్ భారతం కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి అతాలాకుతులం అయిపోతుంది. ఈ వైరస్ బారిన పడి ఎన్నో కుటుంబాలు చిధ్రం
Sandeep Kishan: ప్రస్తుతం యావత్ భారతం కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి అతాలాకుతులం అయిపోతుంది. ఈ వైరస్ బారిన పడి ఎన్నో కుటుంబాలు చిధ్రం అవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. కొడుకు కూతుర్లను పోగొట్టుకొని వృద్దులు అనాధలుగా మారారు. ఈ కష్టకాలంలో ఆ చిన్నారులను ఆదుకునేందుకు సందీప్ కిషన్ ముందుకు వచ్చారు. కరోనా ఇంతలా విజృంభిస్తున్న సమయంలో పలువురు సెలబ్రెటీలు మాత్రం తమకేమి సంబంధం లేదన్నట్లుగా కేవలం ట్వీట్లతోనే సరిపెడుతున్నారు. అయితే పలువురు యంగ్ హీరోలు మాత్రం తమ సేవా గుణాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరో అడివి శేష్ కోఠి ఆసుపత్రిలో నీటి సమస్యను తీర్చగా.. తాజాగా మరో హీరో సందీప్ కిషన్.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాడు.
కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులు ఎవరైనా ఉంటే తెలియజేయాలని.. ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల పాటు ఆ చిన్నారుల బాధ్యతను తాను స్వయంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. భోజనం, చదువుతో పాటు ఇతర అవసరాలను కూడా తీర్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఇందుకోసం తన మెయిల్ ఐడీ.. sundeepkishancovidhelp@gmail.com కు మెయిల్ చేయాలని కోరాడు. దీంతో సందీప్ కిషన్ నిర్ణయానికి నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. సందీప్ కిషన్ చివరగా ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ గల్లి రౌడీ అనే సినిమా చేస్తున్నాడు.
ట్వీట్.
Please Pass on the word.. Love you All ❤️ SK pic.twitter.com/tsgRsgJtSz
— Sundeep Kishan (@sundeepkishan) May 3, 2021
Also Read: కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ తారలు.. 300 మంది కోవిడ్ రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..