Sikh man attacked: అమెరికాలో జాత్యహంకార దాడి.. సిక్కు యువకుడిని సుత్తితో కొట్టిన నల్లజాతీయుడు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా వాసులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఓ హోటల్‌లో సుమిత్ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడి చేశాడు.
Sikh man attacked in US:అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా వాసులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఓ హోటల్‌లో సుమిత్ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడి చేశాడు. అయితే, ఈ సందర్బంగా నల్లజాతీయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతోజాత్యహంకారం పూరితంగా దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.
సిక్కు యువకుడిపై దాడి సమయంలో నల్ల జాతీయుడు ‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. నీ శరీరం రంగు నాలాగా లేదు’ అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. దీంతో జాతి వివక్ష కోణంలో దాడి జరిగిందని భావించి అధికారులు విచారణ చేపట్టారు.
ఏప్రిల్ 26న బ్రౌన్స్‌విల్లేలోని క్వాలిటీ ఇన్ హోటల్లోకి వచ్చిన నల్ల జాతీయుడు లాబీలోకి చేరి పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడే ఉన్న రిసెప్షనిస్టు ఏం కావాలని ప్రశ్నించింది. అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న సిక్కు యువకుడు సుమిత్ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసాడు. కోపంతో రగిలిపోతున్న నల్లజాతీయుడిని సముదాయించేందుకు ప్రయత్నించాడు. సోదరుడిగా భావించాలంటూ కోరినప్పటికీ, అతను వినిపించుకోకుండా జేబులో నుంచి సుత్తి బయటకు తీసి సుమిత్ తలపై దాడి చేశాడు.
కాగా, తీవ్రంగా గాయపడ్డ సుమిత్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.