Corona India: ఈ విపత్కర పరిస్థితి నుంచి భారత్ బయట పడాలంటే మూడే మార్గాలున్నాయి.. అమెరికా డాక్టర్ కీలక సూచన..
Corona India: భారత్ ఎన్నడూ చూడని మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజరోజుకీ పెరుగుతోన్న కేసులు, మరణాల సంఖ్య భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. చివరికీ స్మశాన..
Corona India: భారత్ ఎన్నడూ చూడని మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజరోజుకీ పెరుగుతోన్న కేసులు, మరణాల సంఖ్య భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. చివరికీ స్మశాన వాటికల ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ పెడుతున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచదేశాలకు చెందిన ప్రముఖ నిపుణులు భారత్‌కు పలు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటే వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని ఆయన సూచించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు.. యుద్ధ ప్రాతిపదికన కొన్ని తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని తెలిపారు. ఈ మూడు మార్గాల ద్వారానే ఈ సంక్షోభాన్ని గట్టెక్కించవచ్చని ఫౌజీ సూచించారు. ఇక ఈ ఆపత్కాలంలో యావత్ ప్రపంచం భారత్‌కు అండగా ఉండాలని ఆయన తెలిపారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు భారత్ పలు దేశాలకు తన సహాయాన్ని అందించింది. ప్రస్తుతం భారత్ సంక్షోభంలో ఉంది కాబట్టి ప్రపంచదేశాలు తమకు తోచిన సహాయాన్ని అందించాలని ఆయన కోరారు. ఇక దేశంలో రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సరిపోకపోవడంపై ఫౌజీ స్పందిస్తూ భారత్‌లో కరోనా ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో ఈ పరిస్థితులు తెలియజేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
Also Read: Covid-19: జంతువులకు కూడా కరోనా వ్యాప్తి.. దక్షిణ కొరియా దేశం ఏం చేసిందంటే..?
Student visa: ఇండియా కరోనా సెకండ్ వేవ్.. అమెరికాలో విద్యార్థుల ప్రవేశానికి అప్పటివరకు అవకాశం..
ఆ పాడు పని కోసం.. రెండేళ్ల బిడ్డను అమ్ముకున్న కసాయి తండ్రి.. ఆ తర్వాత ఏమైందంటే..?