AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Second Wave: షాకింగ్..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కొత్త స్ట్రెయిన్..15 రెట్లు ఎక్కువ ప్రమాదకరం అంటున్న సీసీఎంబీ

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రెండో వేవ్ తో ప్రజలు ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపధ్యంలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) షాకింగ్ న్యూస్ చెబుతోంది.

Corona Second Wave: షాకింగ్..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కొత్త స్ట్రెయిన్..15 రెట్లు ఎక్కువ ప్రమాదకరం అంటున్న సీసీఎంబీ
Andhra Pradesh Corona
KVD Varma
|

Updated on: May 05, 2021 | 6:45 AM

Share

Corona Second Wave: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రెండో వేవ్ తో ప్రజలు ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపధ్యంలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) షాకింగ్ న్యూస్ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటపడిందని చెప్పారు శాస్త్రవేత్తలు. ఈ కొత్త వేరియంట్ భారతదేశంలో ఇప్పుడున్న అన్నిటి కంటె 15 రెట్లు ప్రమాదకారి అని వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేస్తుంది. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కరోనా యొక్క 5 వేరియంట్లు కనుగొన్నారు. వీటిలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో ఏపీ స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం మహారాష్ట్రలో కూడా కనిపిస్తోంది.

ప్రస్తుత స్ట్రెయిన్ కంటే ప్రమాదకరం..

కొత్త వేరియంట్‌తో బాధపడుతున్న రోగులు 3-4 రోజుల్లో హైపోక్సియా లేదా డిస్స్పనియాకు గురవుతారు. ఈ పరిస్థితిలో, శ్వాస రోగి యొక్క ఊపిరితిత్తులకు చేరుకోవడం ఆగిపోతుంది. సరైన సమయంలో చికిత్స లేకపోవడం అలాగే, ఆక్సిజన్ మద్దతు లేకపోవడం వల్ల రోగి మరణిస్తాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వైరస్ చైన్ సమయానికి విచ్ఛిన్నం కాకపోతే, ఈ సెకండ్ వేవ్ కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇది ప్రస్తుతం ఉన్న కరోనా జాతులు B.1617 అలాగే B.117 కన్నా ప్రమాదకరమైనది.

కర్నూలులో గుర్తింపు..

గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్ మరియు ప్రైమరీ సోర్స్ GISAID దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న వివిధ వైవిధ్యాల వ్యాప్తిని వివరించింది. దీని ప్రకారం ఈ స్ట్రెయిన్ కర్నూలులో మొదట గుర్తించారు. ఈ వైరస్ విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఈ జాతిని మొదట గుర్తించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది సామాన్య ప్రజలలో చాలా వేగంగా వ్యాపించింది.

శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ వేరియంట్ మంచి రోగనిరోధక శక్తి ఉన్నవారిని కూడా పట్టుకుంటుంది. ఈ జాతి ప్రజల శరీరంలో సైటోకిన్ తుఫానుకు కారణమవుతుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ ”కొత్త స్ట్రెయిన్ గురించి మేము ఇంకా తెలుసుకుంటున్నాం. సీసీఎంబీకి వైరస్ నమూనా విశ్లేషణ కోసం పంపించాం. ఈ వేరియంట్ గత సంవత్సరం మొదటి వేవ్ సమయంలో మనం చూసిన దానికి చాలా భిన్నంగా ఉందని మాత్రం ప్రస్తుతం చెప్పొచ్చు .” అన్నారు.

వైరస్ కు పెరిగిన బలాన్ని ధృవీకరిస్తూ, సంక్రమణ వేగం చాలా ఎక్కువగా ఉందని విశాఖ జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అలాగే, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పి.వి.సుధాకర్ చెప్పారు. కొత్త వేరియంట్ ఇంక్యుబేషన్ కాలం చాలా తక్కువగా ఉందని అదేవిధంగా, పరివర్తన వేగం చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మేము గమనించాం అని సుధాకర్ అన్నారు. వైరస్ సోకిన రోగి గతంలో హైపోక్సియా లేదా డిస్ప్నియా దశకు చేరుకోవడానికి కనీసం ఒక వారం సమయం పట్టింది. ఇప్పుడు మూడు లేదా నాలుగు రోజుల్లో రోగులు పరిస్థితి విషమంగా మారుతోంది. అందుకే ఆక్సిజన్, బెడ్స్, ఐసీయూ పడకల అవసరం బాగా పెరిగిందని ఆయన తెలిపారు.

ఈ వేరియంట్ యువకుల్లోనూ పిల్లల్లోనూ కూడా వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్న వారు కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువ అని ఆయన వివరించారు. GITAM ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సీనియర్ మైక్రోబయాలజిస్ట్ హేమా ప్రకాష్ మాట్లాడుతూ, మంచి మాస్క్ ఎల్లప్పుడూ ధరించడం, గుంపులకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం..వీలైనంత వరకు ఇంట్లో ఉండడం చాలా ముఖ్యమని చెప్పారు.

Also Read: AP Corona Lockdown: ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌ర్ఫ్యూ స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

AP Corona Lockdown: రేపటినుంచి ఏపీలో వాహనాలపై ఆంక్షలు.. సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షల అమలు..